Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 16:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి).

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 16:3
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.


అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది.


అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది.


అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది.


అయితే అబ్రాహాము ఇంకా బ్రతికి ఉండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులకు బహుమానాలిచ్చి, వారినందరిని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు.


కాబట్టి అతడు తనకున్న భార్యలు కాక ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సోదరియైన మహలతును భార్యగా చేసుకున్నాడు.


కాబట్టి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పడుకున్నాడు.


లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.


ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండుగురు పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటి వెళ్లాడు.


ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు. యాకోబు యొక్క పన్నెండుగురు కుమారులు:


హెబ్రోను నుండి వచ్చిన తర్వాత దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా ఉపపత్నులుగా చేసుకున్న తర్వాత ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టారు.


అతనికి రాజకుమార్తెలైన ఏడువందలమంది భార్యలు, మూడువందలమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. అతని భార్యలు అతన్ని తప్పుదారి పట్టించారు.


హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ