Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 16:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 మరియు యెహోవాదూత– ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 తరువాత యెహోవా దూత “ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 ఇంకా యెహోవా దూత, “ఇప్పుడు నీవు గర్భవతివి, మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఎందుచేతనంటే, నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 16:11
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు దేవుడు, “అవును, అయితే నీ భార్య శారా ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అతనితో నా నిబంధనను చేస్తాను, తన తర్వాత తన సంతానంతో ఉండేలా నిత్య నిబంధనగా దానిని స్థిరపరుస్తాను.


దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు.


వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, కళ్ళెత్తి చూశారు, గిలాదు నుండి ఇష్మాయేలీయుల వర్తక బాటసారుల గుంపు ఒకటి రావడం కనిపించింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం మోస్తూ ఉన్నాయి, వారు వాటిని ఈజిప్టుకు తీసుకెళ్తున్నారు.


కాకిపిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక తిరుగుతున్నప్పుడు కాకికి ఆహారం ఇచ్చేది ఎవరు?


బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు.


అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.


ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను.


కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.


ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి.


నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి.


అందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు.


అలా కొంతకాలం గడిచాక హన్నా గర్భవతియై ఒక కుమారుని కన్నది. “నేను అతని కోసం యెహోవాను అడిగాను” అని అంటూ ఆమె అతనికి సమూయేలు అని పేరు పెట్టింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ