Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 15:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఆయన–నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఆయన “దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై, వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 15:13
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.”


నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”


వారు అతనితో, “మేము కొంతకాలం ఇక్కడ నివసించడానికి వచ్చాం ఎందుకంటే కనానులో కరువు తీవ్రంగా ఉంది, మీ దాసుల గొర్రెల మందలకు మేత లేదు. కాబట్టి ఇప్పుడు మీ దాసులను గోషేనులో నివసించనివ్వండి” అని కూడా అన్నారు.


ఆయన తన సేవకుడైన అబ్రాహాముకు చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.


కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.


వారి చేత వెట్టిచాకిరి చేయించారు.


మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.


దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు.


“మీరు ఈజిప్టు దేశంలో విదేశీయులుగా ఉన్నారు; కాబట్టి విదేశీయులను బాధించకూడదు, అణగద్రొక్కకూడదు.


“పరదేశిని అణగద్రొక్కకూడదు; మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి విదేశీయుల జీవితం ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా!


కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు.


ఈజిప్టు కష్టాల నుండి విడిపించి, కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను’ అని వారితో చెప్పు.


కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను.


మీ మధ్య నివసించే పరదేశిని మీ స్థానికంగా జన్మించిన వానిగా పరిగణించాలి. మీలాగే వారిని ప్రేమించండి, ఎందుకంటే మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉండేవారు. నేను మీ దేవుడనైన యెహోవాను.


మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు,


“దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం దగ్గరకు వచ్చినప్పుడు, ఈజిప్టులో ఉన్న మన ప్రజల సంఖ్య అతి విస్తారంగా పెరిగింది.


నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థిరపరచబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు.


మీరు కూడ ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి మీరు విదేశీయులను ప్రేమించాలి.


మీరు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నప్పుడు, మీ దేవుడైన యెహోవా బలమైన హస్తంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడినుండి బయటకు తీసుకువచ్చారని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి సబ్బాతు దినాన్ని పాటించమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ