ఎజ్రా 8:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 నాలుగవదినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితోకూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 నాలుగో రోజు వెండి బంగారు పాత్రలను మన దేవుని మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్33 నాల్గవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |