యెహెజ్కేలు 8:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అప్పుడాయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అప్పుడాయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నువ్వు ఇదంతా చూస్తున్నావా? యూదా జాతి ప్రజలు ఇక్కడ చేస్తున్న అసహ్యమైన పనులు స్వల్పమైనవా? వాళ్ళు దేశాన్ని బలాత్కారంతో నింపివేశారు. ముక్కులకు తీగలు తగిలించుకుంటూ నా కోపాన్ని మరింత రెచ్చగొడుతున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, ఇది చూశావు గదా! యూదా ప్రజలు ఈ నా ఆలయాన్ని అతి సామాన్యమైనదిగా భావిస్తూ, ఆలయంలోనే వారు చెడు పనులు కొనసాగిస్తున్నారు.! ఈ దేశమంతా దౌర్జన్యంతో నిండిపోయింది. వారు నిరంతరం చెడుకార్యాలు చేస్తూ నాకు పిచ్చి పట్టిస్తున్నారు. చూడు, ఒక బూటకపు దేవతలా చంద్రుని ఆరాధించటానికి వారు ముక్కులకు ఉంగరాలు పెట్టుకుంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు! အခန်းကိုကြည့်ပါ။ |