యెహెజ్కేలు 8:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఆయన నన్ను యెహోవా ఆలయ లోపలి ఆవరణంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఇంచుమించు ఇరవై అయిదుగురు మనుష్యులు నాకు కనిపించారు. వారి వీపులు యెహోవా మందిరం వైపు వారి ముఖాలు తూర్పు వైపు తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకునుమధ్యను ఇంచుమించు ఇరువదియయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయముతట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది క్రిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఆయన నన్ను యెహోవా ఆలయ లోపలి ఆవరణంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఇంచుమించు ఇరవై అయిదుగురు మనుష్యులు నాకు కనిపించారు. వారి వీపులు యెహోవా మందిరం వైపు వారి ముఖాలు తూర్పు వైపు తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |