యెహెజ్కేలు 8:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆయాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలైన డెబ్భై మంది అక్కడ ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కొడుకు యజన్యా ఉన్నాడు. వాళ్ళంతా ఆ బొమ్మలకి ఎదురుగా నిలబడి ఉన్నారు. ప్రతివాడి చేతిలో ధూపం వేసే పాత్ర ఒకటి ఉంది. వాళ్ళంతా ధూపం వేయడం వల్ల అది ఒక మేఘంలా పైకి వెళ్తూ ఉంది. దాని పరిమళం అంతటా నిండి ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 అక్కడ షాఫాము కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది. အခန်းကိုကြည့်ပါ။ |