Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 7:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అందమైన ఆభరణాల బట్టి గర్వించి హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 శృంగారమైన ఆయాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు. అవి వాళ్ళ నీచమైన పనులను వర్ణించే విగ్రహ ఆకారాలుగా ఏర్పడ్డాయి. వాటితో వాళ్ళు అసహ్యకరమైన తమ పనులను సాగించారు. కాబట్టి ఆ ఆభరణాలు వాళ్లకి అసహ్యం పుట్టేలా నేను చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 “ఆ ప్రజలు వారి విలువైన ఆభరణాలు వినియోగించి ఒక విగ్రహాన్ని తయారుచేశారు. ఆ విగ్రహాన్ని చూచి వారు గర్వపడ్డారు. వారింకా భయానక విగ్రహాలు చేశారు. వారా హేయమైన వస్తువులను చేశారు. కావున దేవుడనైన నేను వారిని మసిబట్టలా విసిరి పారవేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అందమైన ఆభరణాల బట్టి గర్వించి హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 7:20
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు ఉంచుతాను” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.


అతడు చెక్కించిన అషేరా స్తంభాన్ని తీసి ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.


నేను కట్టే దేవాలయం విశాలంగా, అద్భుతంగా ఉండాలి కాబట్టి చాలా దూలాలు కావాలి.


ఇంకా, యాజకుల నాయకులందరు, ప్రజలందరు ఇతర దేశాల అసహ్యమైన ఆచారాలన్నిటిని అనుసరించి, యెరూషలేములో ఆయన ప్రతిష్ఠించిన యెహోవా మందిరాన్ని అపవిత్రం చేస్తూ మరింతగా నమ్మకద్రోహులయ్యారు.


అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు.


మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.


సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, దేవుడు ప్రకాశిస్తారు.


అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.


మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం అగ్నితో కాల్చబడింది, మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి.


కాబట్టి, నేను షిలోహుకు చేసినట్టే, నా పేరు కలిగి ఉన్న ఆలయానికి, మీరు నమ్మిన ఆలయానికి, మీకు మీ పూర్వికులకు నేను ఇచ్చిన స్థలానికి ఇప్పుడు చేస్తాను.


“ ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు.


ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.


ప్రభువు తన కోపంతో సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు! ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు; ఆయన తన కోప్పడిన దినాన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.


ప్రభువు తన బలిపీఠాన్ని తిరస్కరించి, తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టారు. ఆయన ఆమె రాజభవనాల గోడలను శత్రువుల చేతికి అప్పగించారు; నియామక పండుగ రోజున చేసినట్టుగా వారు యెహోవా నివాసంలో బిగ్గరగా కేకలు వేశారు.


“వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచిన అసహ్యమైన విగ్రహాలను హేయమైన వాటిని తొలగిస్తారు.


నీవు అందమైన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి నీ వస్త్రాల్లో కొన్నిటిని తీసుకున్నావు, అక్కడ నీవు నీ వ్యభిచారం కొనసాగించావు. నీవు అతని దగ్గరకు వెళ్లావు, అతడు నీ అందాన్ని తనది చేసుకున్నాడు.


నేను నీకు ఆహారంగా ఇచ్చిన నాణ్యమైన పిండి, తేనె, నూనెలను తీసుకుని సువాసన వచ్చేలా వాటికి అర్పించావు. జరిగింది ఇదే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు.


ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు.


నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను, కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు. వారు దానిలోనికి వెళ్లి దానిని మలినం చేస్తారు.


ఆయన వారితో, “మందిరాన్ని అపవిత్రం చేయండి. ఆవరణాలను శవాలతో నింపండి. మొదలుపెట్టండి” అన్నారు. వారు బయలుదేరి వెళ్లి పట్టణంలో అందరిని చంపడం మొదలుపెట్టారు.


పూర్వం ఈ మందిర వైభవాన్ని చూసినవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడది మీకు ఎలా కనబడుతోంది? దానితో పోల్చడానికి ఎందుకూ సరిపోదు కదా?


గిద్యోను ఇంకా మాట్లాడుతూ, “నేను చేసే మనవి ఒక్కటే, మీలో ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న ఒక చెవి పోగును నాకు ఇవ్వండి” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు కాబట్టి వారి ఆచారం చెవులకు పోగులు పెట్టుకోవడము.)


గిద్యోను ఆ బంగారాన్ని ఏఫోదులా చేసి దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరు అక్కడికి వెళ్లి దానికి మొక్కి వ్యభిచారం చేశారు. అది గిద్యోనుకు అతని కుటుంబానికి ఉచ్చుగా మారింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ