యెహెజ్కేలు 5:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణాదృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 కాబట్టి నా ప్రాణం పైన ఒట్టు” ఇది ప్రభువైన యెహోవా ప్రకటన. “నీ అసహ్యమైన విషయాలతో నా మందిరాన్ని అపవిత్రం చేశావు కాబట్టి నేను నీ సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తాను. నీ మీద కనికరం చూపను. నిన్ను కాపాడను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 నా ప్రభువైన యెహోనా ఇలా చెప్పాడు, “యెరూషలేమా, నా జీవము తోడుగా నిన్ను నేను శిక్షిస్తానని చెపుతున్నాను! నిన్ను శిక్షిస్తానని నేను ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! ఎందుకంటే, నా పవిత్ర స్థలానికి నీవు భయంకరమైన పనులు చేశావు. దానిని అపవిత్ర పర్చుతూ ఘోరమైన పనులు చేశావు! నేను నిన్ను శిక్షిస్తాను. నీ పట్ల కరుణ ఏ మాత్రం చూపించను. నిన్ను చూచి నేను విచారపడను! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |