Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 47:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 నీవు దానిని వారి మధ్య సమానంగా పంచాలి. మీ పూర్వికులకు ఇస్తానని చేయెత్తి ప్రమాణం చేశాను కాబట్టి, ఈ భూమి మీకు వారసత్వంగా మారుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 నేను ప్రమాణముచేసి మీపితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 మీరు దేశాన్ని సమానంగా పంచుకోవాలి. ఈ దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు నేను ప్రమాణం చేశాను. కావున ఇది మీకు నేను ఇస్తున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 నీవు దానిని వారి మధ్య సమానంగా పంచాలి. మీ పూర్వికులకు ఇస్తానని చేయెత్తి ప్రమాణం చేశాను కాబట్టి, ఈ భూమి మీకు వారసత్వంగా మారుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 47:14
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.


నీవు చూస్తున్న భూమంతా నీకు, నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తాను.


అంతేకాక దేవుడు అతనితో, “ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ఊరు నుండి బయటకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పారు.


నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”


కొంతకాలం ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ వారసులకు ఈ దేశాలన్నీ ఇస్తాను, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను.


దాని మీద యెహోవా నిలబడి ఇలా అన్నారు: “యెహోవాను నేనే, నీ తాత అబ్రాహాముకు దేవుడను, నీ తండ్రి ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ వారసులకు ఇస్తాను.


నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేయెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవాను.’ ”


చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.


నేను వారిని ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి నేను వారిని తీసుకువచ్చిన తర్వాత కూడా ఎత్తైన కొండను గాని గుబురుగా ఉన్న చెట్టును గాని వారు చూడగానే వాటికి బలులు అర్పణలు అర్పిస్తూ, పరిమళ ధూపాలను వేస్తూ పానార్పణలు చేస్తూ నాకు కోపం పుట్టించారు.


మీ పూర్వికులకు ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశమైన ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.


నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు.


“ఇశ్రాయేలు గోత్రాలకు వారసత్వంగా కేటాయించవలసిన దేశం ఇదే, ఇవి వారి భాగాలు” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


‘యెహోవా ఈ ప్రజలకు మ్రొక్కుబడిగా వాగ్దానం చేసిన స్థలానికి తీసుకెళ్లలేక, వీరిని అరణ్యంలో చంపేశారు’ అని అంటారు.


నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు.


చూడండి, ఈ దేశాన్ని నేను మీకిచ్చాను. కాబట్టి మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ