Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 42:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అతడు ఉత్తరం వైపుగా బయటి ఆవరణంలోకి నన్ను నడిపించి ఆలయ ప్రాంగణానికి ఉత్తరాన ఉన్న బయటి గోడకు ఎదురుగా ఉన్న గదుల దగ్గరికి తీసుకువచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఆ మనిషి ఉత్తరం వైపుకు నన్ను నడిపించి బయటి ఆవరణలోకి తోడుకుని వచ్చి ఖాళీ స్థలానికీ ఉత్తరాన ఉన్న కట్టడానికీ ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలబెట్టాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 పిమ్మట ఆ మనిషి ఉత్తరపు గుమ్మంనుండి బయటి ఆవరణకు తీసుకొని వెళ్లాడు. ఉత్తర నియమిత స్థలంలో అనేక గదులతో కూడుకున్న భవనానికి నన్ను నడిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అతడు ఉత్తరం వైపుగా బయటి ఆవరణంలోకి నన్ను నడిపించి ఆలయ ప్రాంగణానికి ఉత్తరాన ఉన్న బయటి గోడకు ఎదురుగా ఉన్న గదుల దగ్గరికి తీసుకువచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 42:1
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు ద్వారం లోపల భాగం చుట్టూ ఉన్న గోడల వెంబడి అరవై మూరలు కొలిచాడు. ఆ కొలత ఆవరణానికి ఎదురుగా ఉన్న ప్రాంగణం వరకు.


తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి.


అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు.


అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.


అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.


అప్పుడతడు నన్ను ప్రధాన ప్రాంగణంలోనికి తీసుకువచ్చి ద్వారబంధాలను కొలిచాడు, వాటి వెడల్పు రెండు వైపులా ఆరు మూరలు ఉంది.


ఆలయానికి అన్ని వైపుల నుండి ఇరవై మూరల దూరంలో యాజకుల గదులు ఉన్నాయి.


ఆ ప్రక్క గదుల బయటి గోడల మందం అయిదు మూరలు. ఆలయపు ప్రక్క గదుల మధ్యలో ఖాళీ స్థలం ఉంది.


బయటి ఆవరణ గోడ పొడవున దక్షిణం వైపున, ఆలయ ప్రాంగణానికి ఆనుకుని, బయటి గోడకు ఎదురుగా గదులు ఉన్నాయి,


అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది.


ఆ గదుల ముందు పది మూరల వెడల్పు, వంద మూరల పొడవు ఉన్న లోపలి మార్గం ఉంది. వాటి తలుపులు ఉత్తరం వైపు ఉన్నాయి.


అయితే ఆలయం బయటి ఆవరణాన్ని కొలత తీసుకోకుండా విడిచిపెట్టాలి, ఎందుకంటే అది యూదేతరులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని అణగద్రొక్కుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ