Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 39:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 “ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయులమధ్య దానిని బయలుపరచెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 నేనొక్కడినే ఇశ్రాయేలులో మహనీయుణ్ణి. ప్రజలు నా పవిత్ర నామాన్ని ఇక ఎంతమాత్రం పాడు చేయకుండా చూస్తాను. దేశాలన్నీ నేనే యెహోవానని తెలుసుకుంటాయి. నేను ఇశ్రాయేలులో నెలకొన్న పవిత్రుడినైన యెహోవానని వారు తెలుసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 “ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 39:7
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.


మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా!


ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను.


యెహోవానైన నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.


“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దానిని సృష్టించిన యెహోవా చెప్పే మాట ఇదే: జరుగబోయే వాటి గురించి, నా కుమారుల గురించి నన్ను అడుగుతారా? నా చేతిపనుల గురించి నన్నే ఆజ్ఞాపిస్తారా?


నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”


ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు. యెహోవా నిన్ను మహిమపరచడం చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి.


నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు. నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క సీయోనని వారు నిన్ను పిలుస్తారు.


నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; నీ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, దూరము నుండి నీ పిల్లలను తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు.


అయితే కోసం నేను ఎవరి దృష్టిలో వారిని బయటకు తీసుకువచ్చానో ఆ జాతుల దృష్టిలో నా నామం అపవిత్రం కాకుండా ఉండేందుకు నేను అనుకున్న ప్రకారం చేయలేదు.


“ ‘ఇశ్రాయేలు ఇంటివారలారా! ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు నా మాట వినకపోతే మీరు వెళ్లి మీ విగ్రహాలను పూజించండి. కాని మీ అర్పణల వలన విగ్రహాల వలన నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయకండి.


అయితే నా నామం కోసం వారిని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. వారు నివసించిన జనాంగాల దృష్టిలో, ఎవరి ఎదుట నన్ను నేను ఇశ్రాయేలీయులకు బయలుపరచుకున్నానో వారి ఎదుట నా పేరు అపవిత్రం కాకూడదని అలా చేశాను.


మీ మూలంగా ఇతర ప్రజల్లో అవమానపరచబడుతున్న నా గొప్ప పేరు ఎంత పరిశుద్ధమైనదో మీకు చూపిస్తాను. వారి కళ్ళెదుట మీ ద్వారా నా పరిశుద్ధతను వెల్లడి చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


అప్పుడు యెహోవానైన నేను శిథిలమైన వాటిని మళ్ళీ కడతానని, పాడైన స్థలాల్లో చెట్లు నాటుతానని మీ చుట్టూ మిగిలి ఉన్న దేశాలు తెలుసుకుంటాయి. యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను చేస్తాను.’


దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.


నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’


ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు నేనే వారి దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు.


“కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగి యాకోబు సంతతిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కనికరిస్తాను.


ఆ సమయం వస్తుంది! అది ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


“ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ