యెహెజ్కేలు 39:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు అన్ని రకాల పక్షులకు అడవి మృగాలకు ఇలా చెప్పు: ‘నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలికి అనగా ఇశ్రాయేలు పర్వతాలమీద జరుగబోయే గొప్ప బలి దగ్గరకు నలువైపుల నుండి తరలి రండి, అక్కడ మీరు మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగుతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–సకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుము–నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు; အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నరపుత్రుడా, అన్ని పక్షుల, అడవి జంతువులతో నా తరఫున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఇక్కడికి రండి! ఇక్కడికి రండి! చుట్టూ మూగండి. నేను మీ కొరకు సిద్ధం చేస్తున్న బలిని మీరు తినండి. ఇశ్రాయేలు పర్వతాల మీద చాలా పెద్ద బలి ఇవ్వబడుతుంది. రండి. మాంసం తినండి. రక్తం తాగండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు అన్ని రకాల పక్షులకు అడవి మృగాలకు ఇలా చెప్పు: ‘నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలికి అనగా ఇశ్రాయేలు పర్వతాలమీద జరుగబోయే గొప్ప బలి దగ్గరకు నలువైపుల నుండి తరలి రండి, అక్కడ మీరు మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగుతారు. အခန်းကိုကြည့်ပါ။ |