Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 38:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలుదేర దీసెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నేను నిన్ను వెనక్కి తిప్పి నీ దవడలకు గాలాలు తగిలించి, నిన్నూ నీ సైన్యాన్నీ గుర్రాలనూ ఆయుధ సామగ్రి అంతటితో నీ రౌతులందరినీ కవచాలు, డాళ్లు ధరించి ఖడ్గాలు చేతపట్టుకున్న వారందనీ మహా సైన్యంగా పంపిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 నిన్ను నేను పట్టుకుని వెనుకకు తీసుకొని వస్తాను. నీ సైన్యంలోని వారందరినీ నేను పట్టుకు వస్తాను. గుర్రాలను, గుర్రపు సైన్యం వారందరిని పట్టుకు వస్తాను. మీ నోళ్లకు గాలం తగిలించి, మీ అందరినీ తిరిగి తీసుకు వస్తాను. మీ సైనికులంతా వారి దుస్తులు, డాళ్లు, కత్తులు ధరిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 38:4
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.’


కొంతమంది గాదీయులు తమ కూటమిని మార్చుకొని అరణ్యంలో సురక్షితమైన స్థలంలో ఉన్న దావీదు దగ్గర చేరారు. వారు పరాక్రమశాలులు, యుద్ధానికి సిద్ధపడినవారు, డాలు ఈటెలను వాడే సమర్థులు, వారు సింహం ముఖంలాంటి ముఖాలు కలిగి కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్తగలరు.


అమజ్యా యూదా వారిని పిలిపించి, వారి కుటుంబాల ప్రకారం వారిని యూదా, బెన్యామీను వారందరికి సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను నియమించాడు. తర్వాత అతడు ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిని లెక్కిస్తే ఈటె డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్లగలవారు 3,00,000 మంది ఉన్నారు.


నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.


రథాలను గుర్రాలను, సైన్యాన్ని వీరులను రప్పించిన యెహోవా చెప్పే మాట ఇదే వారందరు కలిసి పడిపోయారు మరలా ఎప్పటికీ లేవరు, ఆరిపోయిన వత్తిలా వారు నిర్మూలించబడతారు:


గుర్రాల్లారా ఎగరండి, రథాల్లారా రెచ్చిపోండి! యోధులారా, డాళ్లు మోసే కూషు వారలారా, పూతు వారలారా, బయలుదేరండి, విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి.


అది కూడా అష్షూరు వారిలో సైన్యాధిపతులు, అధికారులను, నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, గుర్రాలు స్వారీ చేసేవారిని, అందమైన యువకులను మోహించింది.


కాని నేను నీ దవడలకు గాలాలు తగిలించి, నీ నదులలో ఉన్న చేపలు నీ పొలుసులకు అంటుకుపోయేలా చేస్తాను. నీ పొలుసులకు అంటుకున్న చేపలతో పాటు నైలు నదిలో నుండి నిన్ను బయటకు లాగుతాను.


ఉత్తరాన దూరంగా ఉన్న నీ స్థలంలో నుండి నీవూ, నీతో పాటు అనేక జనాలు గుర్రాలపై స్వారీ చేస్తూ చాలా గొప్ప సైన్యంగా వస్తారు.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.


నేను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, దూరంగా ఉన్న ఉత్తర దిక్కునుండి రప్పించి ఇశ్రాయేలు పర్వతాల మీదికి పంపుతాను.


నేను ఏర్పరచిన బల్ల దగ్గర గుర్రాలను, రౌతులను బలవంతులను, సైనికులందరిని కడుపారా తింటారు.’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.


“అంత్యకాలంలో దక్షిణాది రాజు యుద్ధంలో పాల్గొంటాడు, ఉత్తరాది రాజు రథాలు, గుర్రాల దళం, ఎన్నో యుద్ధ నౌకలతో అతని మీద దాడి చేస్తాడు. అతడు ఎన్నో దేశాలను ఆక్రమించి వరదలా వాటిని లాగేస్తాడు.


ప్రభువైన యెహోవా తన పవిత్రత తోడని ప్రమాణం చేశారు: “మిమ్మల్ని కొంకులతో పట్టుకుని, మీలో మిగిలిన వారిని గాలంతో పట్టుకుని తీసుకెళ్లే కాలం ఖచ్చితంగా రాబోతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ