Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 37:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 మీకు కండరాలను అతికించి మాంసాన్ని పొదిగి మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పెడతాను, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 మీమీద మళ్లీ నరాలు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 మీకు కండరాలను అతికించి మాంసాన్ని పొదిగి మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పెడతాను, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 37:6
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు.


దైవజనుడు ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెహోవా కొండ దేవుడే గాని లోయ దేవుడు కాదని అరామీయులు అనుకుంటున్నారు కాబట్టి, ఈ గొప్ప సైన్యాన్ని మీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”


మీరు మీ ఆత్మను పంపినప్పుడు, అవి సృజించబడ్డాయి, మీరే భూతలాన్ని నూతనపరుస్తారు.


నేను సర్వశక్తిగల దేవునిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కాని యెహోవా అనే నా పేరుతో నన్ను నేను వారికి తెలియపరచుకోలేదు.


కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు; వారి శరీరాలు పైకి లేస్తాయి మట్టిలో నివసిస్తున్నవారు, మేల్కొని సంతోషించాలి. మీ మంచు ఉదయపు మంచు వంటిది; భూమి తన మృతులకు జన్మనిస్తుంది.


రాజులు నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు. వారు నీ ఎదుట తమ ముఖాన్ని నేలకు ఆనించి నమస్కారం చేస్తారు; నీ పాదాల దగ్గర ఉన్న దుమ్మును నాకుతారు. అప్పుడు నీవు, నేను యెహోవాను అని, నా కోసం నిరీక్షణతో ఉన్నవారు నిరాశ చెందరని తెలుసుకుంటావు.”


ఇశ్రాయేలు సరిహద్దుల లోపలే మీరు ఖడ్గంతో చంపబడేలా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.


మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”


నా మీద తిరుగుబాటు చేసేవారిని దోషులను మీలో ఉండకుండా చేస్తాను. వారు ఉంటున్న దేశంలో నుండి వారిని బయటకు రప్పిస్తాను కాని వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు.


నేను ఈజిప్టును పాడు చేసినప్పుడు, అందులో ఉన్నవాటన్నిటిని నాశనం చేసినప్పుడు, దానిలో నివసించే వారినందరిని నిర్మూలం చేసినప్పుడు, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’


చెట్లు తమ పండ్లను ఇస్తాయి, భూమి తన పంటను ఇస్తుంది; ప్రజలు తమ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను వారి కాడిని విరగ్గొట్టి, వారిని బానిసలుగా చేసుకున్న వారి చేతుల్లో నుండి వారిని విడిపించినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.


“అవి పాడుచేయబడ్డాయి, మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి” అని నీవు ఇశ్రాయేలు పర్వతాలను దూషించిన మాటలన్నీ యెహోవానైన నేను విన్నానని నీవు తెలుసుకుంటావు.


ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.


మీరు బ్రతికేలా మీలో నా ఆత్మను ఉంచి మీ స్వదేశంలో మీరు నివసించేలా చేస్తాను. అప్పుడు యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’


ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు నేనే వారి దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు.


నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు.


నేను మాగోగు మీదికి, సముద్ర తీర ప్రాంతాల్లో క్షేమంగా నివసించేవారి మీదికి అగ్ని పంపిస్తాను, అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.


తమ విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూరా, ఎత్తైన కొండలన్నిటి మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, మహా వృక్షాల క్రింద, ఏపుగా పెరిగిన సింధూర వృక్షాలన్నిటి క్రింద ఎక్కడైతే తమ విగ్రహాలన్నిటికి పరిమళ ధూపం వేశారో అక్కడ వారి ప్రజలందరూ చచ్చి పడి ఉండడం చూసి, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.


మీ ప్రజలు మీ మధ్య చంపబడతారు, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.


నీ మీద ఏమాత్రం దయ చూపించను నిన్ను వదిలిపెట్టను. నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’


మీమీద ఏమాత్రం దయ చూపించను; మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. “ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’


అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నానని, నేను మీ దేవుడైన యెహోవానని, వేరే దేవుడు ఎవరూ లేరని మీరు తెలుసుకుంటారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.


“అప్పుడు మీ దేవుడైన యెహోవానైన నేను నా పవిత్ర కొండయైన సీయోను మీద నివసిస్తానని మీరు తెలుసుకుంటారు. యెరూషలేము పరిశుద్ధంగా ఉంటుంది; ఇక ఎన్నడు ఇతర దేశాల సైన్యాలు దానిని ఆక్రమించరు.


మీరు రొట్టెలు తినలేదు ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు. నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకుంటారని ఇలా చేశాను.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ