Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 37:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు. “నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 37:3
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

సమాధిలో మీ మారని ప్రేమ ప్రకటించబడుతుందా? నాశనకూపంలో మీ నమ్మకత్వం ప్రకటించబడుతుందా?


“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నివాసులు లేని పట్టణాల్లా నిన్ను నేను నిర్మానుష్యంగా మార్చినప్పుడు, నిన్ను మహా సముద్రం ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాలను రప్పిస్తాను. నిన్ను మహా సముద్రం నిన్ను ముంచివేస్తున్నప్పుడు,


ఆయన వాటి మధ్య నన్ను అటూ ఇటూ నడిపించారు. ఆ లోయలో బాగా ఎండిపోయిన చాలా ఎముకలు నాకు కనబడ్డాయి.


తండ్రి ఎలాగైతే చనిపోయినవారిని లేపి జీవమిస్తారో, కుమారుడు కూడా తనకు ఇష్టమైనవారికి జీవాన్ని ఇస్తారు.


దేవుడు చనిపోయిన వానిని సజీవంగా లేపడం నమ్మశక్యంగా లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు?


“నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను” అని వ్రాయబడి ఉన్నది. అబ్రాహాము విశ్వాసముంచిన దేవుడు చనిపోయినవారికి జీవమిచ్చేవారు, లేనివాటిని ఉన్నవాటిగా పిలిచేవారు. అలాంటి దేవుని దృష్టిలో అతడు మనకు తండ్రి.


“చనిపోయినవారు ఎలా లేపబడతారు? వారికి ఎలాంటి శరీరం ఉంటుంది?” అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.


వారు తెలివైన వారైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, వారి అంతం ఏమిటో వివేచిస్తారు!


“చూడండి, నేనే ఏకైక దేవున్ని! నేను తప్ప మరో దేవుడు లేడు చంపేవాడను నేనే బ్రతికించేవాడను నేనే. గాయం చేసేది నేనే, బాగు చేసేది నేనే, నా చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు.


“మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే; పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ