యెహెజ్కేలు 37:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 “మనుష్యకుమారుడా, ఒక కర్ర తీసుకుని, దానిపై ‘ఇది యూదాకు, అతని సహచరులైన ఇశ్రాయేలీయులకు చెందినది’ అని వ్రాయి, తర్వాత మరొక కర్ర తీసుకుని, దానిపై, ‘యోసేపు (అంటే, ఎఫ్రాయిం) అతని సహచరులైన ఇశ్రాయేలీయులందరికి చెందినది’ అని వ్రాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 –నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారిదనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారిదనియు వ్రాయుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నరపుత్రుడా, నువ్వు ఒక కర్ర తీసుకుని దాని మీద, యూదావాళ్ళదీ, వాళ్ళ తోటివాళ్ళు ఇశ్రాయేలీయులదీ అని పేర్లు రాయి. మరో కర్ర తీసుకుని దాని మీద, ఎఫ్రాయిము కొమ్మ, అంటే యోసేపు వంశస్థులదీ, వాళ్ళ తోటి వాళ్ళు ఇశ్రాయేలీయులందరిదీ, అని రాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 “నరపుత్రుడా, ఒక కట్టెపుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి, ‘ఈ పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది.’ తరువాత మరో పుల్లను తీసుకొని దాని మీద; ‘ఈ ఎఫ్రాయిము పుల్ల యోసేపుకు, అతని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది,’ అని వ్రాయుము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 “మనుష్యకుమారుడా, ఒక కర్ర తీసుకుని, దానిపై ‘ఇది యూదాకు, అతని సహచరులైన ఇశ్రాయేలీయులకు చెందినది’ అని వ్రాయి, తర్వాత మరొక కర్ర తీసుకుని, దానిపై, ‘యోసేపు (అంటే, ఎఫ్రాయిం) అతని సహచరులైన ఇశ్రాయేలీయులందరికి చెందినది’ అని వ్రాయి. အခန်းကိုကြည့်ပါ။ |