Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 32:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 వారితో ఇలా చెప్పు, ‘నీవు ఇతరులకంటే ఎక్కువ అందంగా ఉన్నావా? నీవు క్రిందికి దిగివెళ్లి, సున్నతిలేనివారి మధ్య పడుకో.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 “ఈజిప్టూ, నీవు ఇతరులెవరికంటెను గొప్ప దానివి కాదు! మృత్యు స్థానానికి వెళ్లు! వెళ్లి, అక్కడ అన్యజనులతో పడివుండు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 వారితో ఇలా చెప్పు, ‘నీవు ఇతరులకంటే ఎక్కువ అందంగా ఉన్నావా? నీవు క్రిందికి దిగివెళ్లి, సున్నతిలేనివారి మధ్య పడుకో.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 32:19
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

సున్నతిలేనివారు చనిపోయినట్లు నీవు విదేశీయుల చేతిలో చస్తావు అని చెప్పింది నేనే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


“ ‘వైభవంలో ఘనతలో ఏదెను తోటలో ఉన్న ఏ చెట్లు నీతో పోల్చబడగలవు? అయినప్పటికీ, నీవు కూడా ఏదెను చెట్లతో పాటు భూమి దిగువకు రప్పించబడతావు; సున్నతిలేనివారి మధ్య, ఖడ్గం వలన చచ్చినవారితో నీవు కూడ పడి ఉంటావు. “ ‘ఫరోకు, అతని పరివారానికి ఇలా జరుగుతుంది, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


“మనుష్యకుమారుడా, నీవు ఈజిప్టు రాజైన ఫరోతో అతని పరివారంతో ఇలా చెప్పు: “ ‘ఘనతలో నీకు సాటి ఎవరు?


పాతాళంలోని బలమైన నాయకులు ఈజిప్టు, దాని మిత్రుల గురించి ఇలా చెప్తారు, ‘వారు దిగి వచ్చారు, వారు సున్నతిలేని వారితో, ఖడ్గంతో చంపబడినవారితో పడుకున్నారు.’


“సమాధి చుట్టూ ఏలాము దాని అల్లరిమూకలు ఉన్నాయి. వారందరూ చంపబడ్డారు, ఖడ్గంతో కూలారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా సున్నతి పొందని వారిగా పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు తమ అవమానాన్ని భరిస్తున్నారు.


“మెషెకు, తుబాలు తమ సమాధుల చుట్టూ తమ అల్లరిమూకలతో పాటు అక్కడ ఉన్నారు. వారంతా సున్నతిలేనివారు, ఖడ్గంతో చంపబడ్డారు ఎందుకంటే సజీవుల దేశంలో వారు భయాన్ని వ్యాపింపజేశారు.


అప్పుడు దావీదు తన దగ్గర నిలబడినవారిని, “సజీవుడైన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ అవమానాన్ని తొలగించిన వానికి ఏ బహుమతి ఇస్తారు?” అని అడిగాడు.


మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ