Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 32:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 అన్ని జాతులలో అతి క్రూరులైన బల శూరుల ఖడ్గంతో నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను. వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు, దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; వారు ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు. వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 యుద్ధంలో నీ ప్రజలను చంపటానికి నేను ఆ సైనికులను వినియోగిస్తాను. అన్ని దేశాలలో అతి భయంకరమైన దేశం నుండి ఆ సైనికులు వస్తారు. ఈజిప్టు అతిశయపడే వస్తువులన్నిటినీ వారు ధ్వంసం చేస్తారు. ఈజిప్టు ప్రజలు నాశనం చేయబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 అన్ని జాతులలో అతి క్రూరులైన బల శూరుల ఖడ్గంతో నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను. వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు, దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 32:12
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేశాలు నీ అవమానం గురించి వింటాయి; నీ కేకలు భూమంతటా వినబడతాయి. యోధులు ఒకరికొకరు తగిలి తడబడి; ఇద్దరూ కలిసి క్రిందకు పడిపోతారు.”


నిన్ను ఎరిగిన జనులంతా నిన్ను బట్టి వణికిపోతారు; నీవు భయానక ముగింపుకు వచ్చావు నీవు పూర్తిగా నాశనమైపోతావు.’ ”


నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.


కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది.


ప్రజల్లో అతి క్రూరులైన తన సైన్యాన్ని తీసుకుని ఆ దేశాన్ని నాశనం చెయ్యడానికి అతడు వస్తాడు. వారు ఈజిప్టు వారిపై తమ ఖడ్గాలు దూసి దేశమంతా శవాలతో నింపుతారు.


కాబట్టి దాని దుర్మార్గానికి తగినట్టుగా నేను దానిని దేశాల అధినేత చేతులకు అప్పగించాను. నేను దానిని విసిరివేశాను,


విదేశీ జాతులలో క్రూరులు దాన్ని నరికి నేల మీద వదిలేశారు. కొండల్లో, లోయల్లో దాని కొమ్మలు పడి ఉన్నాయి; భూమిమీది వాగులన్నిటిలో దాని కొమ్మలు విరిగిపడ్డాయి. భూమి మీద ఉన్న జాతులన్ని దాని నీడ నుండి బయటకు వచ్చి దానిని వదిలేశాయి.


“మనుష్యకుమారుడా! ఈజిప్టు అల్లరిమూకల కోసం విలపించు పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు ఆమెను, బలమైన దేశాల కుమార్తెలను భూమికి అప్పగించు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ