Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 31:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని అందంగా తయారుచేశాను, దేవుని తోటయైన ఏదెను లోని చెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అనేక కొమ్మలతో నేను దాన్ని అందంగా చేశాను. అందుకు దేవుని తోట, ఏదెనులోని వృక్షాలన్నీ దాని మీద అసూయపడ్డాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 అనేకమైన కొమ్మలతో ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను. ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ దీనిపట్ల అసూయ చెందాయి!’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని అందంగా తయారుచేశాను, దేవుని తోటయైన ఏదెను లోని చెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 31:9
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

లోతు కళ్ళెత్తి సోయరు వైపు యొర్దాను మైదాన ప్రాంతమంతా యెహోవా తోటలా, ఈజిప్టులా, సస్యశ్యామలమై ఉన్నట్లు చూశాడు. (ఇది యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు అలా ఉంది.)


అతనికి మందలు, పశువులు, దాసులు ఎక్కువగా ఉన్నందుకు ఫిలిష్తీయులు అసూయపడ్డారు.


యోసేపు అన్నలు అతనిపై అసూయపడ్డారు కానీ అతని తండ్రి ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు.


కాని నేను నా బలాన్ని నీకు చూపించాలని భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను.


కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?


కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే.


యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి.


మీరు సంతోషంగా బయటకు వెళ్తారు, మీరు సమాధానంగా తీసుకెళ్తారు. మీ ఎదుట పర్వతాలు కొండలు పాటలు పాడడం ప్రారంభిస్తాయి, పొలం లోని చెట్లన్నీ తమ చేతులతో చప్పట్లు కొడతాయి.


నీ అందం కారణంగా నీ కీర్తి దేశాల్లో వ్యాపించింది, ఎందుకంటే నేను నీకు ఇచ్చిన వైభవం నీ అందాన్ని పరిపూర్ణం చేసిందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఎత్తైన దేవదారు చెట్టులో చిటారు కొమ్మ ఒకటి తీసి దానిని నాటుతాను; దాని పైనున్న కొమ్మల్లో ఒక లేత కొమ్మను త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతాను.


యెహోవానైన నేనే పొడవైన చెట్లను చిన్నవిగా, నీచమైన చెట్లను గొప్ప చెట్లుగా మార్చగలనని, పచ్చని చెట్టుని ఎండిపోయేలా, ఎండిన చెట్టుని పచ్చని చెట్టులా చేస్తానని అడవిలో ఉన్న అన్ని చెట్లు తెలుసుకుంటాయి. “ ‘యెహోవానైన నేనే ఈ మాట అంటున్నాను. నేనే దానిని నెరవేరుస్తాను.’ ”


దేవుని తోటయైన, ఏదెనులో నీవు ఉండేవాడివి; ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని, మరకతం, నీలమణి, పద్మరాగం, అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి; నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి.


పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి.


“ ‘వైభవంలో ఘనతలో ఏదెను తోటలో ఉన్న ఏ చెట్లు నీతో పోల్చబడగలవు? అయినప్పటికీ, నీవు కూడా ఏదెను చెట్లతో పాటు భూమి దిగువకు రప్పించబడతావు; సున్నతిలేనివారి మధ్య, ఖడ్గం వలన చచ్చినవారితో నీవు కూడ పడి ఉంటావు. “ ‘ఫరోకు, అతని పరివారానికి ఇలా జరుగుతుంది, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


వ్యర్థంగా ఉండిన ఈ భూమి ఏదెను తోటలా మారింది; శిథిలమై పాడుబడి నిర్మానుష్యంగా ఉన్న పట్టణాలు ఇప్పుడు కోటలతో జనసంచారంతో సందడిగా ఉన్నాయని వారంటారు.


ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు; ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు. ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని, వివేకులకు వివేకాన్ని ఇస్తారు.


సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; మహా వృక్షాలు నాశనమైపోయాయి! బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: దట్టమైన అడవి నరకబడింది.


దావీదు సాధిస్తున్న విజయాలను చూసి సౌలు అతనంటే మరింత భయపడ్డాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ