యెహెజ్కేలు 28:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అయితే నీ వ్యాపారం విస్తరించి నీవు హింసతో నిండిపోయి పాపం చేశావు. కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను, కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్య నీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండకుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది. ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు. అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను. దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను. నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు. నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి. కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అయితే నీ వ్యాపారం విస్తరించి నీవు హింసతో నిండిపోయి పాపం చేశావు. కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను, కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్య నీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |