Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 27:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 “ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 “ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 27:22
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.


అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు, “ఒకవేళ అలాగైతే, ఇలా చేయండి: దేశంలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని అంటే ఔషధతైలం, కొంచెం తేనె, కొన్ని సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తా గింజలు, బాదం పప్పులు మీ సంచుల్లో పెట్టుకుని ఆ వ్యక్తికి కానుకగా తీసుకెళ్లండి.


కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.


తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, ఆయనకు పన్నులు చెల్లిస్తారు. షేబ సెబా రాజులు కానుకలు తెస్తారు.


రాజు దీర్ఘకాలం జీవించును గాక! షేబ నుండి ఆయనకు బంగారం ఇవ్వబడును గాక. ప్రజలు నిత్యం ఆయన కోసం ప్రార్థించుదురు గాక. రోజంతా ఆయనను స్తుతించుదురు గాక.


ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో నీ దేశం నిండిపోతుంది. వారందరు షేబ నుండి వస్తారు, బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు, యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.


“అప్పుడే కోలాహలం చేసే గుంపు ఆమె చుట్టూ వినిపించింది; అల్లరిమూకలోని వారితో పాటు ఎడారి మార్గాన త్రాగుబోతులు వచ్చారు. వారు ఈ అక్కచెల్లెళ్ల చేతులకు కడియాలను తొడిగి వారి తలకు అందమైన కిరీటాలు పెట్టారు.


దేవుని తోటయైన, ఏదెనులో నీవు ఉండేవాడివి; ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని, మరకతం, నీలమణి, పద్మరాగం, అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి; నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి.


షేబ వారు, దేదాను వారు, తర్షీషు వర్తకులు, దాని కొదమ సింహాల్లాంటి వారందరు నిన్ను చూసి, “దోచుకోవడానికి వచ్చావా? వెండి బంగారాలను, పశువులను సరుకులను కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి, దోచుకోవడానికి నీ సైన్యాన్ని సమకూర్చుకున్నావా?” అని అంటారు.’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ