Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 26:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 తీరప్రాంతపు అధికారులందరూ తమ సింహాసనాల మీది నుండి దిగి, వారి వస్త్రాలను, చేతికుట్టుతో చేసిన వస్త్రాలను తీసివేసి, భయంతో నేలపై కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి ఆందోళన చెందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 సముద్రతీర దేశరాజులంతా తమ సింహాసనాలు దిగి తమ సంతాపాన్ని వెలిబుచ్చుతారు. వారు తమ ప్రత్యేక రాజదుస్తులు తీసివేస్తారు. వారు తమ అందమైన బట్టలు విసర్జిస్తారు. పిమ్మట వారు ‘భయసూచక దుస్తులు’ ధరిస్తారు. వారు నేలమీద కూర్చుని, భయంతో వణుకుతారు. ఎంత త్వరగా నీవు నాశనం చేయబడ్డావో చూచి వారు విస్మయం చెందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 తీరప్రాంతపు అధికారులందరూ తమ సింహాసనాల మీది నుండి దిగి, వారి వస్త్రాలను, చేతికుట్టుతో చేసిన వస్త్రాలను తీసివేసి, భయంతో నేలపై కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి ఆందోళన చెందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 26:16
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.”


అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు; అది నీరులా అతని కడుపులోకి, నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది.


నా మీద నేరం మోపేవారు అవమానాన్ని వస్త్రంగా ధరించుదురు గాక ఒక వస్త్రంలో అయినట్టుగా సిగ్గుతో చుట్టబడతారు.


అతని శత్రువులకు అవమాన వస్త్రాలను ధరింపచేస్తాను, కాని అతని తల ప్రకాశవంతమైన కిరీటంతో అలంకరించబడుతుంది.”


నా బాధను చూసి ఆనందిస్తున్న వారందరు అవమానంతో సిగ్గుపడాలి; నా మీద గర్వించే వారందరు సిగ్గుతో అపకీర్తి పాలవుదురు గాక.


ఎదోము పెద్దలు భయపడతారు, మోయాబు నాయకులకు వణుకు పుడుతుంది. కనాను ప్రజలు భయంతో నీరైపోతారు;


సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.


ద్వీపాలు దానిని చూసి భయపడుతున్నాయి; భూమి అంచులు వణుకుతున్నాయి. వారు వచ్చి చేరుతున్నారు;


“కన్యయైన బబులోను కుమార్తె, క్రిందికి దిగి ధూళిలో కూర్చో; బబులోనీయుల రాణి పట్టణమా, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నీవు సున్నితమైన దానవని సుకుమారివని ఇకపై పిలువబడవు.


నీ దుమ్ము దులుపుకో; యెరూషలేమా, లేచి కూర్చో. బందీగా ఉన్న సీయోను కుమారీ, నీ మెడకున్న సంకెళ్ళు తీసివెయ్యి.


“అది ఎలా శిథిలమైపోయిందో! వారు ఎలా విలపిస్తున్నారో! మోయాబు సిగ్గుతో ఎలా వెన్నుచూపిస్తుందో! మోయాబు దాని చుట్టూ ఉన్నవారందరికి, హేళనగా భయం పుట్టించేదిగా మారింది.”


సీయోను కుమార్తె పెద్దలు మౌనంగా నేలమీద కూర్చున్నారు; తమ తలలపై ధూళి చల్లుకొని గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము యువతులు తమ తలలు నేలకు వంచుకున్నారు.


నీకు అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు వేసి, మంచి చర్మంతో చేసిన చెప్పులు నీ పాదాలకు తొడిగించాను. నీకు సన్నని అవిసె నారబట్టలు వేసి ఖరీదైన పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.


నేను నీకు భయంకరమైన ముగింపు ఇస్తాను, నీవు ఇకపై ఉండవు. నీ గురించి ఎంత వెదికినా నీవు ఎప్పటికీ కనిపించవు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”


నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.


“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి.


నేను వారి ముందు నా ఖడ్గాన్ని ఆడించినప్పుడు, నీ కారణంగా అనేకమందికి కలవరాన్ని కలిగిస్తాను, వారి రాజులు నిన్ను చూసి భయపడతారు. నీవు కూలిపోయిన రోజున వారంతా ప్రాణభయంతో నిత్యం వణికిపోతారు.


రాజు దుఃఖిస్తారు, యువరాజు నిరాశకు గురవుతాడు, దేశ ప్రజల చేతులు వణకుతాయి. వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను, వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను. “ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. నా కోపాన్ని మీమీద చూపిస్తాను. మీ ప్రవర్తనకు మీరు చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.


అప్పుడు రాజు ముఖం తెల్లబోయింది, భయంతో అతని మోకాళ్లు వణుకుతూ కొట్టుకున్నాయి.


వారు యెహోవాను అనుసరిస్తారు; ఆయన సింహంలా గర్జిస్తారు, ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు.


యోనా హెచ్చరిక నీనెవె రాజుకు చేరినప్పుడు, అతడు తన సింహాసనం దిగి, తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు.


నేను రాజ సింహాసనాలను కూలదోసి ఇతర రాజ్యాల అధికారాన్ని నాశనం చేస్తాను. నేను రథాలను రథసారథులను కూలదోస్తాను; గుర్రాలు గుర్రపురౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిపోతారు.


అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని దీనులకు దయ చూపిస్తారు.”


ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ