Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 24:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ, మడ్డి ఉన్న కుండకు శ్రమ, దాని తుప్పు పోదు. ఏ వరుసలో వచ్చినా సరే దానిలో నుండి మాంసాన్ని ముక్క తర్వాత ముక్కగా తీయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగలకుండా, మానకుండ మడ్డిగలిగియుండుకుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, రక్త నగరానికి బాధ. మడ్డి గల ఆ కుండకు బాధ తప్పదు. దానిలోనుంచి ఆ మడ్డి పోదు. దానికోసం చీటీలు వెయ్యకుండా వండిన దాన్ని ముక్క వెంట ముక్క దానిలోనుంచి తీసుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 “‘నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పుతున్నాడు, హంతకులున్న ఈ నగరమునకు కీడు మూడింది. తుప్పుమరకలున్న కుండలా యెరూషలేము ఉంది. ఆ మచ్చలు తొలగింప బడవు! కుండలో నుండి ప్రతి మాంసం ముక్కను బయటకు తీయుము. ఆ మాంసాన్ని తినవద్దు! పాడైపోయిన ఆ మాంసం నుండి యాజకులను ఏమీ తీసుకోనివ్వద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ, మడ్డి ఉన్న కుండకు శ్రమ, దాని తుప్పు పోదు. ఏ వరుసలో వచ్చినా సరే దానిలో నుండి మాంసాన్ని ముక్క తర్వాత ముక్కగా తీయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 24:6
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

అలాగే దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు. అతడు పట్టుకున్న వారిని నేలపై పడుకోబెట్టి త్రాడుతో వారిని కొలిపించాడు. అతడు వారిలో ప్రతి రెండు త్రాళ్ల పొడవున్న వారిని చంపి, మూడవ తాడు కొలతలో ఉన్నవారిని బ్రతకనిచ్చాడు. కాబట్టి మోయాబీయులు దావీదుకు లోబడి అతనికి కప్పం చెల్లించారు.


యూదా వారు యెహోవా దృష్టిలో తప్పుగా ప్రవర్తించేటట్టు మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేము ఆ చివర నుండి ఈ చివర వరకు చిందించాడు.


ఇవి మనష్షే పాపాలు, అతడు చేసిన పనులన్నిటిని బట్టి, నిరపరాధుల రక్తం చిందించినందుకు, యూదా ప్రజలను తన సముఖంలో లేకుండా చేయాలని యెహోవా ఆజ్ఞ ప్రకారం జరిగాయి. ఎందుకంటే అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపాడు, అది క్షమించడానికి యెహోవా ఇష్టపడలేదు.


నీవు సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా శుభ్రం చేయడానికి వాడే చూర్ణం వాడినా, నీ అపరాధపు మరక ఇంకా కనిపిస్తుంది,” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.


ఈ పట్టణం మీకు కుండగా ఉండదు, మీరు దానిలో మాంసం కారు. ఇశ్రాయేలు సరిహద్దులలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను.


వారు, ‘మన ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు; ఈ పట్టణం ఒక కుండ అయితే మనం దానిలో మాంసం’ అని అంటున్నారు.


నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


“మనుష్యకుమారుడా, నీవు దానికి తీర్పు తీరుస్తావా? రక్తం చిందించిన ఈ పట్టణానికి నీవు తీర్పు తీరుస్తావా? అలా అయితే నీవు దాని అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి దానిని నిలదీస్తూ


దానిలో అధికారులు వేటాడినదాన్ని చీల్చే తోడేళ్లలా ఉన్నారు; అక్రమ సంపాదన కోసం వారు రక్తాన్ని చిందించి ప్రజలను చంపుతారు.


ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తన మధ్య రక్తాన్ని చిందిస్తూ, విగ్రహాలను తయారుచేస్తూ తనను తాను అపవిత్రం చేసుకునే నగరమా,


తిరుగుబాటు చేసే ఈ ప్రజల గురించి ఉపమానరీతిగా ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక కుండ తెచ్చి దానిలో నీళ్లు పోసి, దానిని పొయ్యిమీద పెట్టు.


“ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ! నేను మరి ఎక్కువగా కట్టెలు పేర్చుతాను.


వారు నా ప్రజల కోసం చీట్లు వేసి అబ్బాయిలను ఇచ్చి వేశ్యలను తీసుకున్నారు. అమ్మాయిలను అమ్మి ద్రాక్షరసం కొన్నారు.


అపరిచితులు అతని ఆస్తులను తీసుకెళ్లినప్పుడు, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి, యెరూషలేము మీద చీట్లు వేసేిన రోజున, నీవు దూరంగా నిలబడ్డావు, నీవు వారిలో ఒకనిగా ఉన్నావు.


అప్పుడు నావికులు, “రండి, ఎవరి మూలంగా ఈ ఆపద రాడానికి ఎవరు బాధ్యులో చీట్లు వేసి తెలుసుకుందాం” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేరిట వచ్చింది.


నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు; యథార్థవంతుడు ఒక్కడూ లేడు. అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు; వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు.


అబద్ధాలతో దోపిడీతో నిండి ఉన్న, హంతకుల పట్టణానికి శ్రమ! నిత్యం బాధితులు ఉండే, రక్తపు పట్టణానికి శ్రమ!


అయినప్పటికీ ఆమెను బందీగా తీసుకెళ్లారు. ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని ముక్కలు చేశారు. దాని అధిపతుల కోసం చీట్లు వేశారు, దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు.


నీతిమంతుడు హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల నిరపరాధ రక్తదోషం అంతా మీ మీదికి వస్తుంది.


త్రవ్వడానికి మీ దగ్గర పరికరాలతో పాటు ఒక పారను దగ్గర ఉంచుకుని దానితో గుంట త్రవ్వి, మలవిసర్జన తర్వాత మట్టితో మలాన్ని కప్పివేయాలి.


యెహోషువ, “గుహ ద్వారం తెరిచి ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకురండి” అని అన్నాడు.


ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను. నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను.


ప్రవక్తల రక్తం దేవుని పరిశుద్ధ ప్రజల రక్తం, భూమి మీద వధించబడిన వారందరి రక్తం ఆమెలో కనిపిస్తుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ