Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 24:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 “ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్ర పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 “‘నీవు నాపట్ల పాపం చేశావు. దానితో నీ చర్మం మాలిన్యమయ్యింది. నిన్ను కడిగి శుభ్రపర్చాలను కున్నాను. కాని నీ వంటిమీది మచ్చలు పోకుండెను నీపట్ల నా తీవ్రమైన కోపం తీరేవరకు నిన్ను కడిగే ప్రయత్నం మళ్లీ చేయను!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 “ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 24:13
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.


నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు, నీ సిగ్గులేని వ్యభిచారం! కొండలమీద, పొలాల్లో నీ హేయమైన పనులు నేను చూశాను. యెరూషలేమా, నీకు శ్రమ! నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?”


“ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు.


ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది; ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది; ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. “యెహోవా, నా బాధను చూడు, ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.”


మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప, మా రోజులను పాత రోజుల్లా నూతనపర్చండి.


అప్పుడు నీ మీద నా ఉగ్రత తగ్గిపోతుంది, రోషంతో కూడిన నా కోపం నీ మీద నుండి తొలగిపోతుంది; నేను ప్రశాంతంగా ఉంటాను, ఇకపై కోపంగా ఉండను.


“మనుష్యకుమారుడా, యెరూషలేముతో ఇలా చెప్పు, ‘నీవు శుద్ధి చేయబడని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం కురవదు.’


తర్వాత దానికున్న మలినం కరిగిపోయి, మడ్డి పూర్తిగా పోయేలా ఆ కుండ వేడెక్కి దాని రాగి మెరిసే వరకు దానిని బొగ్గుల మీద ఉంచండి.


మీ ప్రజల్లో మూడవ భాగం మీలోనే తెగులుతో చస్తారు, కరువుతో నశిస్తారు; మరో మూడవ భాగం మీ గోడల బయట ఖడ్గానికి కూలిపోతారు. మిగిలిన భాగాన్ని నేను గాలికి చెదరగొట్టి ఖడ్గంతో వారిని వెంటాడతాను.


“అప్పుడు నా కోపం తీరుతుంది, వారి మీద నా ఉగ్రత తగ్గుతుంది, నా ప్రతీకారం తీరుతుంది. నేను వారి మీద నా ఉగ్రతను పూర్తిగా కుమ్మరించినప్పుడు, యెహోవానైన నేను రోషంతో మాట్లాడానని వారు తెలుసుకుంటారు.


కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు.


నేను ఇశ్రాయేలును స్వస్థపరిచేటప్పుడు, ఎఫ్రాయిం పాపాలు బహిర్గతం అవుతున్నాయి, సమరయ నేరాలు బయటపడుతున్నాయి. వారు మోసం చేస్తూనే ఉంటారు, దొంగలు ఇళ్ళలో చొరబడతారు, బందిపోటు దొంగలు వీధుల్లో దోచుకుంటారు;


దానిని ఉతికిన తర్వాత, యాజకుడు దానిని మళ్ళీ పరీక్షించాలి, ఒకవేళ ఆ మరక మారకుండా వ్యాపించకుండ అలాగే ఉంటే, అది అపవిత్రమే. వస్త్రం ఎటువైపు పాడైనా, దానిని కాల్చివేయాలి.


“రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే,


ఆమె ఎవరికీ లోబడదు, ఆమె దిద్దుబాటును అంగీకరించదు. ఆమె యెహోవా మీద నమ్మకముంచదు, ఆమె తన దేవున్ని సమీపించదు.


నేను యెరూషలేము గురించి, ‘ఖచ్చితంగా నీవు నాకు భయపడి దిద్దుబాటును అంగీకరిస్తావు! అప్పుడు దాని ఆశ్రయ స్థలం నాశనం చేయబడదు, నా శిక్షలేవీ దాని మీదికి రావు’ అని అనుకున్నాను. కాని వారు అన్ని రకాల చెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు.


అప్పుడు అతడు నన్ను పిలిచి, “ఉత్తర దేశం వైపు వెళ్లేవాటిని చూడు, అవి ఉత్తర దేశంలో నా ఆత్మకు నెమ్మది కలిగిస్తాయి” అన్నాడు.


ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.


అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ