Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 22:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మ రింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 కాబట్టి నేను నా కోపం వాళ్ళ మీద కుమ్మరిస్తాను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ మీదకి రప్పించి, నా కోపాగ్నితో వాళ్ళను కాల్చేస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

31 కావున వారికి నా కోపాన్ని చూపిస్తాను. వారిని సర్వనాశనం చేస్తాను! వారు చేసిన చెడుకార్యాలకు వారిని నేను శిక్షిస్తాను. ఇదంతా వారి స్వయంకృత అపరాధమే!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 22:31
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.


అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండం నా ఉగ్రత అనే దుడ్డుకర్ర అతని చేతిలో ఉంది.


దేశాన్ని మొత్తం పాడుచేయడానికి, యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా, వారు దూరదేశం నుండి, ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు.


అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను; అది దుఃఖించి రోదిస్తుంది. అది నాకు అగ్నిగుండంలా అవుతుంది.


చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.


“ ‘నేను వారి పంటకోతను తీసివేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ద్రాక్షతీగెకు ద్రాక్షపండ్లు ఉండవు. అంజూర చెట్టు మీద అంజూర పండ్లు ఉండవు, వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చింది వారి దగ్గరి నుండి తీసివేయబడుతుంది.’ ”


యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, అది దాని పునాదులను దహించివేసింది.


అయితే తమ విగ్రహాలను అనుసరిస్తూ ఎప్పటిలాగే అసహ్యమైన పనులు చేసేవారికి వాటి ప్రతిఫలాన్ని వారి తల మీదికి రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”


“ ‘నీవు నీ యవ్వన దినాలను జ్ఞాపకం చేసుకోక వీటన్నిటితో నాకు కోపం రేపావు కాబట్టి, నీవు చేసిన పనిని నేను నిశ్చయంగా నీ తల మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. మీరు మీ ఇతర అసహ్యకరమైన ఆచారాలకు అసభ్యతను జోడించలేదా?


వెండి, ఇత్తడి, ఇనుము, తగరాన్ని పోగుచేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది, కరిగించినట్లు నేను నా కోపంతో నా ఉగ్రతతో మిమ్మల్ని పోగుచేసి ఆ పట్టణం లోపల ఉంచి మిమ్మల్ని కరిగిస్తాను.


యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:


ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడి దాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.


ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది! నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను. నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను.


నీ మీద ఏమాత్రం దయ చూపించను నిన్ను వదిలిపెట్టను. నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’


కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు.


అప్పుడు దేవాలయంలో నుండి ఒక పెద్ద స్వరం ఏడుగురు దేవదూతలతో, “మీరు వెళ్లి దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి” అని బిగ్గరగా చెప్పడం విన్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ