Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 20:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకునుమధ్యను సూచనగా ఉండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా ఆ విశ్రాంతిదినాలు నాకూ, మీకూ మధ్య సూచనగా ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 నేను నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమైనవని చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు సూచిస్తాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 20:20
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి, ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి యెహోవా సబ్బాతు దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధం చేశారు.


సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి.


ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ దానిని పట్టుదలతో ఆచరించేవారు, ఏ కీడు చేయకుండ, తమ చేతిని బిగబట్టుకునేవారు ధన్యులు.”


“నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా నా సబ్బాతును పాటిస్తే, సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే, దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా, మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే,


సబ్బాతు దినాన మీ ఇళ్ళ నుండి బరువులు తేకండి, ఏ పని చేయకండి, అయితే నేను మీ పూర్వికులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలి.


అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మీరు నా మాటకు విధేయత చూపుతూ, సబ్బాతు దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా ఎలాంటి బరువులు తీసుకురాకుండా, ఏ పని చేయకుండా సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే,


అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”


యెహోవానైన నేనే వారిని పవిత్రపరచానని వారు తెలుసుకునేలా, నాకు వారికి మధ్య సూచనగా సబ్బాతులను నియమించాను.


వారు తమ మొదటి సంతానాన్ని బలి ఇచ్చి తమను తాము అపవిత్రం చేసుకోనిచ్చాను. నేనే యెహోవానని వారు తెలుసుకునేలా వారిని భయాందోళనలకు గురిచేస్తాను.’


నీవు నా పరిశుద్ధ వస్తువులను తృణీకరించి నా సబ్బాతులను అపవిత్రం చేశావు.


“ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ