యెహెజ్కేలు 20:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అయితే ఎడారిలో ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరించకుండా, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, ఎడారిలో నా ఉగ్రత నేను వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళను నాశనం చేద్దామనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 “‘అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద తిరుగుబాటు చేసింది. వారు నా న్యాయాన్ని పాటించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించారు. పైగా అవి ఎంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్లు వారా విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం చేయ సంకల్పించాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။ |