Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 19:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మలు దానికున్నాయి. అది మేఘాలను తాకే అంతగా పైకి పెరిగింది దానికున్న అనేక కొమ్మలతో ఏపుగా పెరిగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 భూపతు లకు దండములైనట్టి గట్టిచువ్వలు దానికి కలిగియుండెను, అది మేఘములనంటునంతగా పెరిగెను, విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి. అవి కొన్ని చేతికర్రల్లా ఉన్నాయి. ఆ కొమ్మలు రాజదండాల్లా ఉన్నాయి. ఆ ద్రాక్షాలత అలా, అలా పొడుగ్గా, చాలా కొమ్మలతో మేఘాలను అంటేలా పెరిగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మలు దానికున్నాయి. అది మేఘాలను తాకే అంతగా పైకి పెరిగింది దానికున్న అనేక కొమ్మలతో ఏపుగా పెరిగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 19:11
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.


సొలొమోను తన తండ్రియైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజైన హీరాము విని సొలొమోను దగ్గరకు తన రాయబారులను పంపాడు; ఎందుకంటే అతడు దావీదుతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండేవాడు.


గతంలో యెరూషలేమును పరిపాలించిన బలమైన రాజుల ఆధీనంలోనే యూఫ్రటీసు నది అవతలి ప్రాంతమంతా ఉండేది. వారికి పన్నులు, కప్పం, సుంకం చెల్లించేవారు.


వారు మాకిచ్చిన జవాబు ఇది: “మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము.


యెహోవా, “నీ శత్రువుల మధ్య పరిపాలించు!” అని అంటూ, సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు,


అది మీ కుడి హస్తం నాటిన వేరు, మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు.


మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద, మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి.


యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది.


అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి నేల మీద పారవేయబడింది. తూర్పు గాలి వీచగా దాని పండ్లు వాడిపోయాయి; బలమైన దాని కొమ్మలు అగ్నిలో పడి కాలిపోయాయి.


దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి దాని పండ్లను కాల్చివేసింది. పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”


వధించడానికి పదును పెట్టబడింది, మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది! “ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది.


“ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’


అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా, అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది; దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది.


ఆ చెట్టు ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని కొమ్మ ఆకాశాన్ని అంటుకుంది; భూమి అంచుల వరకు అది కనిపించింది.


మొదటి రోజున మీరు మనోహరమైన చెట్ల కొమ్మలు, తాటి మట్టలు, కాలువల ప్రక్కన ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు, ఇతర నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకుని మీ దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులు ఆనందించండి.


“అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ