యెహెజ్కేలు 17:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి చెందుతుందా? అది ఎండిపోయేలా ప్రజలు దాని వేరు పెకిలించి, దాని పండ్లు కోయరా? దాని చిగురులన్నీ ఎండిపోతాయి. దానిని వేర్లతో సహా పెకిలించడానికి బలమైన చేయి గాని, చాలామంది వ్యక్తులు గాని అవసరం లేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ప్రజలను ఇలా అడుగు. “అది అభివృద్ధి చెందుతుందా? ప్రజలు దాని వేళ్ళను పీకివేసి దాని పళ్ళు కోసుకోరా? అప్పుడది ఎండి పోవాల్సిందే గదా! దాని చిగుళ్ళు ఎండి పోయాక ఎంతమంది దాని కోసం శ్రమించినా దాని వేళ్ళు ఇక చిగురించవు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “మరి ఆ మొక్క విజయం సాధిస్తుందని మీరనుకుంటున్నారా? లేదు! ఆ క్రొత్త గ్రద్ద మొక్కను భూమినుండి పెరికివేస్తుంది. మొక్క వేళ్లను గ్రద్ద నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే తినేస్తుంది. క్రొత్త ఆకులన్నీ ఎండి రాలిపోతాయి. మొక్క చాలా బలహీనమవుతుంది. మొక్కను వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని తీసుకోదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి చెందుతుందా? అది ఎండిపోయేలా ప్రజలు దాని వేరు పెకిలించి, దాని పండ్లు కోయరా? దాని చిగురులన్నీ ఎండిపోతాయి. దానిని వేర్లతో సహా పెకిలించడానికి బలమైన చేయి గాని, చాలామంది వ్యక్తులు గాని అవసరం లేదు. အခန်းကိုကြည့်ပါ။ |