Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 16:52 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

52 నీ అక్కచెల్లెళ్లకు నీవు విధించిన అవమాన శిక్ష నీవే భరించాలి. వారి పాపాల నీ పాపాలు కంటే చాలా నీచంగా ఉన్నాయి కాబట్టి వారు నీ కంటే ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారు. నీ పనుల వలన నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి సిగ్గుపడి అవమానాన్ని భరించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

52 నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

52 నువ్వు వాళ్ళకన్నా అత్యధికంగా అసహ్యమైన పనులు చేశావు గనుక నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా నువ్వు చూపించావు. నువ్వు వాళ్లకు విధించిన అవమాన శిక్ష నీకే రావాలి. నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా కనిపిస్తున్నారు గనుక నీకు అవమానం, సిగ్గూ కలుగుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

52 కావున నీ సిగ్గు నీవు భరించాలి. నీతో పోల్చినప్పుడు నీ తోబుట్టువులు మంచివాళ్లుగా కన్పించేలా నీవు ప్రవర్తించావు. నీవు ఘోరమైన చెడుకార్యాలు చేశావు. అందుకు నీవు సిగ్గుపడాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

52 నీ అక్కచెల్లెళ్లకు నీవు విధించిన అవమాన శిక్ష నీవే భరించాలి. వారి పాపాల నీ పాపాలు కంటే చాలా నీచంగా ఉన్నాయి కాబట్టి వారు నీ కంటే ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారు. నీ పనుల వలన నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి సిగ్గుపడి అవమానాన్ని భరించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 16:52
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదా అవి తనవేనని గుర్తుపట్టి ఇలా అన్నాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడైన షేలాకు ఇచ్చి పెళ్ళి చేయలేదు.” ఆ తర్వాత అతడు ఆమెతో మరలా ఎప్పుడూ పడుకోలేదు.


అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.


నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.”


యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు.


నేను దారితప్పిన తర్వాత, పశ్చాత్తాపపడ్డాను; నేను అర్థం చేసుకున్న తర్వాత, నా రొమ్ము కొట్టుకున్నాను. నా యవ్వనంలో కలిగిన అవమానాన్ని భరిస్తూ, నేను సిగ్గుపడ్డాను అవమానపాలయ్యాను.’


“మేము అపకీర్తి పాలయ్యాము, ఎందుకంటే మేము అవమానించబడ్డాము సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.”


నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు.


నీవు, నీ కుమార్తెలు చేసినట్లు నీ సోదరియైన సొదొమ గాని దాని కుమార్తెలు గాని చేయలేదని నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


“ ‘నేను సొదొమకు దాని కుమార్తెలకు, సమరయకు దాని కుమార్తెలకు వారి సంపదతో పాటు మీ సంపదను తిరిగి ఇస్తాను.


తద్వార వారి ఆదరణ కోసం నీవు చేసిన దానంతటిని బట్టి నీవు అవమానాన్ని భరించి సిగ్గుపడతావు.


నీవు గర్వించే రోజుల్లో, నీ దుర్మార్గం బయటపడక ముందు నీ సోదరి సొదొమ గురించి కూడా ప్రస్తావించవు,


నీవు చేసిన వాటన్నిటికి నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు నీవు వాటిని జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు, నీ అవమానాన్ని బట్టి ఇక ఎన్నటికీ నోరు విప్పవు, ఇదే యెహోవా వాక్కు.’ ”


“సమాధి చుట్టూ ఏలాము దాని అల్లరిమూకలు ఉన్నాయి. వారందరూ చంపబడ్డారు, ఖడ్గంతో కూలారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా సున్నతి పొందని వారిగా పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు తమ అవమానాన్ని భరిస్తున్నారు.


ఇకపై మిమ్మల్ని దేశాలు దూషించడం మీరు వినరు, ఇకపై మిమ్మల్ని జనాంగాల అవమానించవు, మీ జాతిని పతనమయ్యేలా చేయరు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


ఎవరినుండి భయం లేకుండా వారు తమ స్వదేశంలో క్షేమంగా నివసిస్తున్నప్పుడు వారు నాకు చేసిన నమ్మకద్రోహాన్ని, దానివల్ల వారు పొందిన అవమానాన్ని మర్చిపోతారు.


వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి నా సన్నిధికి రాకూడదు, నా పరిశుద్ధ వస్తువుల దగ్గరకు గాని అతి పరిశుద్ధ అర్పణల దగ్గరకు గాని రాకూడదు. వారు చేసిన అసహ్యమైన పనులకు వారు అవమానాన్ని భరించాలి.


అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.


“తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు.


ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.


అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి.


గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి? వాటివలన మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా! ఆ పనుల ఫలం మరణమే!


అతడు దావీదుతో, “నీవు నాకన్నా నీతిమంతుడవు; నీవు నాకు మేలే చేశావు కాని నేను నీకు చాలా కీడు చేశాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ