Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 16:47 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

47 నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

47 అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారుచేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

47 అయితే అవేవో చిన్న విషయాలన్నట్టు, వాళ్ళ అసహ్యమైన ప్రవర్తన ప్రకారం గాని, వాళ్ళ దుర్మార్గంలో గాని నువ్వు ఉండొద్దు. నిజానికి వాళ్ళందరికన్నా నీ ప్రవర్తన ఎంతో ఘోరం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

47 వారు చేసిన మహా పాపాలన్నీ నీవూ చేశావు. కాని నీవింకా ఘోరమైన తప్పు పనులు చేశావు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

47 నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 16:47
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.


యూదా వారు యెహోవా దృష్టిలో తప్పుగా ప్రవర్తించేటట్టు మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేము ఆ చివర నుండి ఈ చివర వరకు చిందించాడు.


అయితే ప్రజలు మాట వినలేదు. మనష్షే వారిని తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండ యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.


ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది.


నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది.


నీవు, నీ కుమార్తెలు చేసినట్లు నీ సోదరియైన సొదొమ గాని దాని కుమార్తెలు గాని చేయలేదని నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


సమరయ సైతం నీవు చేసిన పాపంలో సగమైనా చేయలేదు. నీవు వారికంటే అసహ్యమైన పనులు చేశావు. నీవు చేసిన వాటితో పోల్చితే నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడతారు.


నీ అక్కచెల్లెళ్లకు నీవు విధించిన అవమాన శిక్ష నీవే భరించాలి. వారి పాపాల నీ పాపాలు కంటే చాలా నీచంగా ఉన్నాయి కాబట్టి వారు నీ కంటే ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారు. నీ పనుల వలన నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి సిగ్గుపడి అవమానాన్ని భరించు.


అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు!


మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ