Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 16:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

44 “ ‘సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నీ గురించి ఈ సామెత చెప్తారు: “తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదే” అని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

44 సామెతలు చెప్పువారందరును–తల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదే యని నిన్నుగూర్చియందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

44 చూడు! సామెతలు చెప్పేవాళ్ళందరూ, ‘తల్లి ఎలాంటిదో కూతురూ అలాంటిదే’ అని నిన్ను గూర్చి అంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

44 “నిన్ను గురించి చెప్పుకునే ప్రజలందరికీ ఇప్పుడు ఇంకొక విషయం తోడవుతుంది. వారంతా, ‘తల్లిలాగనే కూతురు కూడ’ అని అంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

44 “ ‘సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నీ గురించి ఈ సామెత చెప్తారు: “తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదే” అని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 16:44
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

నాబోతు చనిపోయాడని అహాబు వినగానే, యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను వశం చేసుకోవడానికి అతడు లేచి వెళ్లాడు.


తమ ఎదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం క్షేత్రాల్లో ధూపం వేశారు. చెడుపనులు చేస్తూ యెహోవాకు కోపం రేపారు.


ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు.


అయితే ప్రజలు మాట వినలేదు. మనష్షే వారిని తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండ యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.


ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు.


“మనుష్యకుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, ప్రతీ దర్శనం విఫలమవుతుంది’ అని ఇశ్రాయేలు దేశంలో చెప్పే సామెతకు అర్థం ఏమిటి?


వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఇకపై ఇశ్రాయేలు దేశంలో వినబడకుండ నేను ఆ సామెతకు ముగింపు ఇవ్వబోతున్నాను. ప్రతీ దర్శనం నెరవేరబోయే రోజులు ఎదురుగా ఉన్నాయని వారితో చెప్పు.


ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఇలా చెప్తున్నారు: మీ మూలలు, మీ పుట్టుక కనానీయుల దేశంలోనే; మీ తండ్రి అమోరీయుడు, మీ తల్లి హిత్తీయురాలు.


నీవు భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ తల్లికి తగిన కుమార్తెవు; అలాగే నీవు తన భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ అక్కకు తగ్గ చెల్లెలివి. నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు.


పాత సామెత చెప్పినట్లుగా, ‘దుర్మార్గుల నుండి దుర్మార్గమైనవే వస్తాయి’ కాబట్టి నా చేయి నిన్ను తాకదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ