Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 16:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 నీవు కామవాంఛలతో నిండిన నీ పొరుగువారైన ఈజిప్టు వారితో మరి ఎక్కువగా వ్యభిచారం చేసి నాకు కోపాన్ని రేపావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 నువ్వు కామ వాంఛలతో నిండి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వేశ్యలా ప్రవర్తించి, వ్యభిచార క్రియలు ఎన్నో చేసి నాకు కోపం పుట్టించావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 పిమ్మట నీవు కామాతురుడైన నీ పొరుగు వాడైన ఈజిప్టు వద్దకు వెళ్లావు. నన్ను ఆగ్రహపర్చేలా నీవు వానితో అనేకసార్లు వ్యభిచరించావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 నీవు కామవాంఛలతో నిండిన నీ పొరుగువారైన ఈజిప్టు వారితో మరి ఎక్కువగా వ్యభిచారం చేసి నాకు కోపాన్ని రేపావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 16:26
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

సలహా తీసుకున్న తర్వాత రాజు రెండు బంగారు దూడలను చేయించాడు. అతడు ప్రజలతో, “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టము. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించిన మీ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు” అని చెప్పాడు.


అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు వీరే” అని అన్నారు.


మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు.


“ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే, అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా? దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా? అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు, ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


వారు తమ యవ్వనం నుండి వ్యభిచారం చేస్తూ ఈజిప్టులో వేశ్యలుగా మారారు. ఆ దేశంలో వారి రొమ్ములు పిండబడ్డాయి, వారి కన్య చనుమొనలు నలిపివేయబడ్డాయి.


అది ఈజిప్టులో ప్రారంభించిన వ్యభిచారాన్ని ఇంకా వదల్లేదు, దాని యవ్వనంలోనే పురుషులు దానితో పడుకున్నప్పుడు, దాని కన్య చనుమొనలను నలిపి, దానితో తమ కామాన్ని తీర్చుకున్నారు.


నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి.


ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు.


అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు!


అది అతని శరీరం నుండి కారుతూ ఉన్నా లేక ఆగిపోయినా అది అతన్ని అపవిత్రం చేస్తుంది. ఈ విధంగా కారడం వలన అతడు అపవిత్రుడు అవుతాడు.


“ఇప్పుడు యెహోవాకు భయపడి పూర్తి నమ్మకత్వంతో ఆయనను సేవించండి. యూఫ్రటీసు నది అవతల, ఈజిప్టులో మీ పూర్వికులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను సేవించండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ