యెహెజ్కేలు 14:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 “మనుష్యకుమారుడా, ఈ మనుష్యులు తమ హృదయాల్లో విగ్రహాలను ఉంచుకొని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకున్నారు. నా దగ్గర విచారణ చేయడానికి నేను వారిని అనుమతించాలా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 –నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 “నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 “నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 “మనుష్యకుమారుడా, ఈ మనుష్యులు తమ హృదయాల్లో విగ్రహాలను ఉంచుకొని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకున్నారు. నా దగ్గర విచారణ చేయడానికి నేను వారిని అనుమతించాలా? အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు తప్పించుకుని ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నవారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నాకు దూరంగా ఉన్న వారి వ్యభిచార హృదయాలను బట్టి నేను ఎలా దుఃఖించానో, వారి విగ్రహాల పట్ల వారి కళ్లల్లో కనిపించిన మోహాన్ని బట్టి నేను ఎలా బాధపడ్డానో జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన చెడును బట్టి వారి అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి తమను తాము అసహ్యించుకుంటారు.