యెహెజ్కేలు 14:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేముమీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఎందుకంటే ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. యెరూషలేముకు విరోధంగా దానిలోని మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయడానికి నేను కరువు, ఖడ్గం, క్రూర మృగాలు, తెగులు అనే నాలుగు శిక్షలను కచ్చితంగా పంపుతాను. మరింత గడ్డు పరిస్థితి కలిగిస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ఆలోచించు. ఆ నాలుగు రకాల శిక్షలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం మీదికి శత్రుసైన్యాలను. క్షామాన్ని, రోగాలను, క్రూర మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, పశువులను అందరినీ తొలగిస్తాను! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది! အခန်းကိုကြည့်ပါ။ |
కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “నీ దేశంలో మూడు సంవత్సరాల కరువు రావాలని కోరుకుంటావా? నీ శత్రువులు నిన్ను వెంటాడగా, వారిని ఎదుర్కోలేక మూడు నెలలు పారిపోతావా? నీ దేశంలో మూడు రోజులు తెగులు వ్యాపించాలని కోరుకుంటావా? ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో ఆలోచించి నిర్ణయించుకో” అన్నాడు.