యెహెజ్కేలు 12:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అయితే నేను యెహోవానైయున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఇతర ప్రజలకు తమ అసహ్యమైన పనులను గూర్చి వివరించడానికి నేను కొంతమందిని కత్తీ, కరువూ, తెగులు బారిన పడకుండా కాపాడతాను.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 “కాని కొద్దిమంది ప్రజలను మాత్రం బ్రతక నిస్తాను. రోగాలవల్ల గాని, ఆకలిచేత గాని లేక యుద్ధం వల్ల గాని వారు చనిపోరు. వారు నాపట్ల చేసిన భయంకర నేరాలను గురించి ఇతర ప్రజలకు తెలియజెప్పటానికిగాను వారిని నేను బ్రతకనిస్తాను. పిమ్మట వారు నేను యెహోవానని తెలుసుకొంటారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.” အခန်းကိုကြည့်ပါ။ |