Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 6:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే: ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ; ఇవి రూబేను వంశాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 వారి వంశాల మూలపురుషులు వీరు: ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీళ్ళు రూబేను కుటుంబాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఇశ్రాయేలు కుటుంబాల నాయకుల పేర్లు ఇవి: ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు రూబేనుకు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనే నలుగురు కుమారులు గలరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే: ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ; ఇవి రూబేను వంశాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 6:14
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.


రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.


వారి కుటుంబ పెద్దలు వీరే: ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు. వీరు ధైర్యవంతులైన వీరులు, ప్రసిద్ధి చెందినవారు వారి కుటుంబ పెద్దలు.


ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు వీరు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.


తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్శాము, సమూయేలు. వీరు తమ కుటుంబాలకు పెద్దలు. దావీదు పాలనలో తోలా సంతానం యుద్ధవీరులుగా లెక్కించబడ్డారు. వీరి సంఖ్య 22,600.


బేల కుమారులు: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ మొత్తం అయిదుగురు. వీరు కుటుంబ పెద్దలు. తమ వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 22,034.


వీరు ఏహూదు వారసులు, గెబాలో నివసిస్తున్న కుటుంబాలకు పెద్దలు. వీరు బలవంతంగా మనహతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది:


అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులను గురించి ఈజిప్టు రాజైన ఫరోను గురించి మాట్లాడి, ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురమ్మని వారిని ఆదేశించారు.


అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె అతనికి ఫీనెహాసును కన్నది. వీరు వంశాల ప్రకారం, లేవీ కుటుంబాల పెద్దలు.


రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు.


షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; యామీను ద్వార, యామీనీయుల వంశం; యాకీను ద్వార, యాకీనీయుల వంశం;


రూబేను గోత్రం వారికి వారి వంశాల ప్రకారం మోషే వారికిచ్చింది:


రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.


ఇవి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో వారసత్వంగా పొందిన ప్రాంతాలు, వీటిని యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్ర వంశ పెద్దలు వారికి కేటాయించారు.


యాజకుడైన ఎలియాజరు, నూను కమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వంశాల నాయకులు షిలోహులో యెహోవా ఎదుట సమావేశ గుడారం ద్వారం దగ్గర చీట్లు వేసి పంచి ఇచ్చిన వారసత్వ భూములివి. ఈ విధంగా వారు భూమిని పంచిపెట్టడం ముగించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ