పని ముగించిన తర్వాత వారు మిగతా డబ్బును రాజు దగ్గరకు, యెహోయాదా దగ్గరకు తెచ్చారు. ఆ డబ్బుతో యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులు సేవా సంబంధమైన వస్తువులు, దహనబలికి ఉపయోగపడే వస్తువులు, గరిటెలు, వేరువేరు వెండి బంగారు వస్తువులు చేయించారు. యెహోయాదా బ్రతికి ఉన్నంతకాలం యెహోవా మందిరంలో ప్రతిరోజు దహనబలులు అర్పించబడ్డాయి.
అప్పుడు మోషే: “పరిశుద్ధాలయం కోసం ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఇకమీదట ఏ అర్పణ తీసుకురాకూడదు” అని ఒక ఆజ్ఞ ఇవ్వగా వారు దాన్ని శిబిరమంతటికి తెలియజేశారు. అప్పుడు ప్రజలు కానుకలు తీసుకురావడం మానుకున్నారు.