Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 27:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “నీవు సమావేశ గుడారానికి ఆవరణం నిర్మించాలి. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నీవు మందిరానికి ఆవరణం ఏర్పాటు చెయ్యాలి. కుడివైపున, అంటే దక్షిణ దిక్కున ఆవరణం నూరు మూరల పొడవు ఉండాలి. పేనిన సన్న నార తెరలు ఒక వైపుకు ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 (“పవిత్ర గుడారం చుట్టూ తెరలతో కట్టు. ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వైపున యాభై గజాల పొడవు తెరలు గోడగా ఉండాలి. సున్నితమైన బట్టతో ఈ తెరలు చేయబడాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “నీవు సమావేశ గుడారానికి ఆవరణం నిర్మించాలి. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 27:9
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

లోపలి ఆవరణాన్ని మూడు వరసల్లో చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.


యెహోవా సమక్షంలో ఉన్న ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అదే రోజు రాజు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వును అర్పించాడు.


యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.


యాజకుల ఆవరణాన్ని, పెద్ద ఆవరణాన్ని చేయించాడు, ఆ ఆవరణాలకు తలుపులు చేయించి వాటిని ఇత్తడితో పొదిగించాడు.


కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.


బయట గడిపిన వెయ్యి దినాలకంటే మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు. దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము.


వారు యెహోవా దేవాలయంలో నాటబడి, మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు.


దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉండాలి.


ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర;


అప్పుడు వారు మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేశారు.


ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర; ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు; సమావేశ గుడారంలో సేవకు ఉపయోగించే అన్ని ఉపకరణాలు;


తర్వాత మోషే సమావేశ గుడారానికి బలిపీఠానికి చుట్టూ ఆవరణాన్ని ఏర్పాటు చేసి ఆవరణ ద్వారానికి తెర వేశాడు. ఇలా మోషే పని ముగించాడు.


దాని చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టి ఆవరణ ద్వారానికి తెర తగిలించాలి.


అతడు ద్వారం లోపల భాగం చుట్టూ ఉన్న గోడల వెంబడి అరవై మూరలు కొలిచాడు. ఆ కొలత ఆవరణానికి ఎదురుగా ఉన్న ప్రాంగణం వరకు.


తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి.


అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు.


తూర్పు ద్వారంలా ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ఆవరణానికి దారితీసే ఒక గుమ్మం ఉంది. ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు దూరం కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.


అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.


అప్పుడతడు నన్ను తూర్పు వైపున ఉన్న లోపలి ఆవరణం దగ్గరికి తీసుకువచ్చి దాని ద్వారాన్ని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.


లోపలి ఆవరణంలో లోపలి ద్వారం బయట రెండు గదులు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం దగ్గర దక్షిణం వైపుగా ఒకటి, తూర్పు ద్వారం దగ్గర ఉత్తరం వైపుగా ఒకటి ఉన్నాయి.


లోపలి ఆవరణం నుండి ఇరవై మూరల భాగంలో బయటి ఆవరణం కాలిబాట ఎదురుగా ఉన్న భాగంలో, వసారా మూడు అంతస్తుల వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.


ఆవరణం యొక్క తెరలు, గుడారం బలిపీఠం చుట్టూ ఉన్న ద్వారపు తెర, దాని త్రాళ్లు, వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు.


సమావేశ గుడారం, బలిపీఠం చుట్టూ ఉన్న ఆవరణ తెరలు, ఆవరణ ప్రవేశ ద్వారపు తెరలు, వాటి త్రాళ్లు గుడారంలో సేవకు ఉపయోగించే వస్తువులన్నిటిని మోయాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ గెర్షోనీయులు చేయాలి.


అంతేకాక, ఆవరణం చుట్టూ ఉండే స్తంభాలు వాటి దిమ్మలు, మేకులు, త్రాళ్లు వాటికి సంబంధించినవన్నీ వారే మోయాలి. ప్రతి ఒక్కరు మోయడానికి నిర్దిష్టమైన వాటిని అప్పగించండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ