Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 24:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఇశ్రాయేలీయుల ఈ నాయకులపై దేవుడు చేయి ఎత్తలేదు; వారు దేవున్ని చూశారు, వారు తిని త్రాగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఆయన ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు ఎలాంటి హాని కలిగించలేదు. అక్కడ వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని అన్న పానాలు పుచ్చుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూచారు, కాని దేవుడు వాళ్లను నాశనం చేయలేదు. వాళ్లంతా కలిసి తిని త్రాగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఇశ్రాయేలీయుల ఈ నాయకులపై దేవుడు చేయి ఎత్తలేదు; వారు దేవున్ని చూశారు, వారు తిని త్రాగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 24:11
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టింది: “నన్ను చూస్తున్న దేవుడు మీరే.” ఆమె, “నన్ను చూస్తున్న దేవుని నేను వెనుక నుండి చూశాను” అని అన్నది.


అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి.


అతడు ఆ కొండమీద బలి అర్పించి, బంధువులను భోజనానికి పిలిచాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడే గడిపారు.


కాబట్టి ఆమె అహాబు పేరున ఉత్తర్వులు వ్రాసి వాటి మీద అతని ముద్రను ముద్రించి, వాటిని నాబోతు నివసించే పట్టణ పెద్దలకు, సంస్థానాధిపతులకు శాసనాలు పంపింది.


అతడు తనతో శతాధిపతులను, ప్రధానులను, ప్రజల అధికారులను, దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకొని రాజును యెహోవా మందిరం నుండి రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు పై ద్వారం గుండా ప్రవేశించి, రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు.


నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు.


నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.


అప్పుడు మోషే మామయైన యెత్రో, ఒక దహనబలిని ఇతర బలులను దేవునికి అర్పించగా, దేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం తినడానికి అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలందరితో కలిసి వచ్చాడు.


అప్పుడు యెహోవా మోషేతో, “నీవు క్రిందకు దిగివెళ్లి, ప్రజలు యెహోవాను చూడాలని హద్దులు దాటివచ్చి వారిలో అనేకమంది నశించిపోకుండా వారిని హెచ్చరించు.


అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది యెహోవా దగ్గరకు ఎక్కి వచ్చి దూరం నుండి ఆరాధించాలి.


వెళ్లండి, సంతోషంగా మీ ఆహారాన్ని తినండి ఆనందకరమైన హృదయంతో మీ ద్రాక్షరసం త్రాగండి, ఎందుకంటే మీరు చేసే దాన్ని దేవుడు ముందుగానే ఆమోదించారు.


అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు; వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు కానీ నీళ్లు దొరకవు. వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు; నిరాశ నిస్పృహలతో, వారు తమ తలలను కప్పుకుంటారు.


నా ప్రభువా, మీ దాసుడనైన నేను మీతో ఎలా మాట్లాడగలను? నా బలం పోయింది, కష్టంగా ఊపిరి తీసుకుంటున్నాను.”


అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను. అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?”


రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, ప్రజల సంస్థానాధిపతులు తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు,


మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు, మీ కుటుంబాలు తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి.


అగ్ని మధ్యలో నుండి మాట్లాడిన దేవుని స్వరాన్ని మీరు విన్నట్లు మరి ఏ ప్రజలైనా విని బ్రతికారా?


“మనం చచ్చిపోతాం! మనం దేవున్ని చూశాం!” అని మనోహ తన భార్యతో అన్నాడు.


“ప్రాణాలతో మిగిలిన అధిపతులు వచ్చారు; శూరులకు వ్యతిరేకంగా యెహోవా ప్రజలు నా దగ్గరకు వచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ