Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 23:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 మీ దేవుడైన యెహోవాను ఆరాధించండి, ఆయన ఆశీర్వాదం మీ ఆహారం మీద నీటి మీద ఉంటుంది. నేను మీ మధ్య నుండి రోగాన్ని తీసివేస్తాను,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు నువ్వు తినే ఆహారం మీదా, తాగే నీళ్ళ మీదా ఆయన దీవెనలు ఉంటాయి. ఎలాంటి రోగాలూ మీకు సంక్రమించవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 మీ యెహోవా దేవుణ్ణి మీరు సేవించాలి. మీరు ఇలా చేస్తే, భోజన పానీయాలు సమృద్ధిగా ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సర్వరోగాల్నీ మీలోనుండి తొలగించి వేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 మీ దేవుడైన యెహోవాను ఆరాధించండి, ఆయన ఆశీర్వాదం మీ ఆహారం మీద నీటి మీద ఉంటుంది. నేను మీ మధ్య నుండి రోగాన్ని తీసివేస్తాను,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 23:25
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు.


ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.


దేవుడతనికి హృదయంలో ఆనందం కలిగిస్తారు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మరిచిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు.


వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.


సీయోనులో నివసించేవారెవరూ, “నాకు ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పరు; దానిలో నివసించే ప్రజల పాపాలు క్షమించబడతాయి.


వారు ప్రేమించి సేవించిన వారు అనుసరించిన, సంప్రదించిన పూజించిన సూర్యునికి చంద్రునికి ఆకాశమండలం లోని అన్ని నక్షత్రాలకు బహిర్గతమవుతారు. వారు పోగుచేయబడక, పాతిపెట్టబడక, నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటారు.


పది రోజుల తర్వాత చూస్తే రాజు ఆహారం తిన్న యువకులందరికంటే వీరు ఆరోగ్యంగా, పుష్టిగా కనిపించారు.


నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధంగా ఉండండి. నేలపై ప్రాకే ఏ జీవిని బట్టి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు.


“ ‘ఒకవేళ మీరు నా శాసనాలు పాటిస్తూ, నా ఆజ్ఞలకు లోబడడానికి జాగ్రత్త వహిస్తే,


నా మందిరంలో ఆహారం ఉండేలా పదవ భాగాన్నంతా నా ఆలయానికి తీసుకురండి. ఇలా చేసి నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలను తెరచి పట్టలేనంతగా దీవెనలు కుమ్మరిస్తానో లేదో చూడండి అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.


అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు.


ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,


మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.


మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి.


మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి.


ఆయన మిమ్మల్ని ప్రేమించి దీవించి అభివృద్ధి కలుగజేస్తారు. మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భఫలాన్ని, మీ భూఫలమైన మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువుల దూడలను, మందల గొర్రెపిల్లలను దీవిస్తారు.


యెహోవా మిమ్మల్ని ప్రతీ వ్యాధి నుండి కాపాడతారు. ఈజిప్టులో మీకు తెలిసిన భయంకరమైన రోగాల మీ మీదికి రాకుండా చేస్తారు, కాని మిమ్మల్ని ద్వేషించే వారందరి మీదికి వాటిని రప్పిస్తారు.


అయితే మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనను గట్టిగా అంటిపెట్టుకుని ఆయనను సేవించమని యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని పాటించేలా జాగ్రత్త వహించాలి” అని చెప్పాడు.


అయితే ప్రజలు యెహోషువతో, “లేదు! మేము యెహోవానే సేవిస్తాం” అన్నారు.


ప్రజలు యెహోషువతో, “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయనకే లోబడతాం” అన్నారు.


అప్పుడు సమూయేలు ప్రజలతో, “భయపడకండి, మీరు ఈ చెడు చేశారనేది నిజమే కాని యెహోవాను విడిచిపెట్టకుండా మీ పూర్ణహృదయంతో యెహోవాను సేవించండి.


అయితే మీరు ఖచ్చితంగా యెహోవా పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా మీ పూర్ణహృదయంతో ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన గొప్ప పనులను జ్ఞాపకం చేసుకోండి.


కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీ పూర్ణహృదయంతో యెహోవా దగ్గరకు మీరు తిరిగి వస్తే, ఇతర దేవుళ్ళను, అష్తారోతు విగ్రహాలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలతో యెహోవా వైపు మీ హృదయాలను త్రిప్పి ఆయనను మాత్రమే సేవించండి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ