Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 12:43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

43 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “పస్కాను ఆచరించడానికి పాటించవలసిన నియమాలు ఇవే: “విదేశీయులెవరు దీనిని తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

43 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఇది పస్కాపండుగనుగూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదుగాని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

43 తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. “ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

43 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “పస్కాను ఆచరించడానికి పాటించవలసిన నియమాలు ఇవే: “విదేశీయులెవరు దీనిని తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 12:43
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక!


దానిని మీరు ఇలా తినాలి: మీ నడుము కట్టుకుని, మీ పాదాలకు చెప్పులు వేసుకుని మీ చేతిలో కర్ర పట్టుకోవాలి. త్వరగా దానిని తినాలి; ఇది యెహోవా పస్కాబలి.


“మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు.


మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు.


“ ‘పరిశుద్ధ అర్పణను యాజక కుటుంబ సభ్యులు తప్ప బయటి వారెవరూ అంటే యాజకుని అతిథి గాని అతని ఇంట్లో జీతగాడు గాని తినకూడదు.


ఒక యాజకుని కుమార్తె విధవరాలు అయితే లేదా విడాకులు తీసుకుంటే, ఇంకా పిల్లలు లేకుండా ఆమె యవ్వనురాలై తన తండ్రి ఇంట్లో నివసించడానికి తిరిగి వస్తే, ఆమె తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు గాని ఏ అనధికార వ్యక్తి దానిని తినకూడదు.


“ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ”


ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు.


తర్వాత ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీ పూర్వికుల కుటుంబం ఈజిప్టులో ఫరో క్రింద ఉన్నప్పుడు నన్ను నేను వారికి బయలుపరచుకోలేదా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ