Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 11:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 పురుషులు స్త్రీలు తమ పొరుగువారి నుండి వెండి బంగారు వస్తువులను అడిగి తీసుకోవాలని ప్రజలకు చెప్పు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఇశ్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి, ‘మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టు ప్రక్కల వాళ్ల దగ్గరకు వెళ్లి, వారి వెండి, బంగారు వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 పురుషులు స్త్రీలు తమ పొరుగువారి నుండి వెండి బంగారు వస్తువులను అడిగి తీసుకోవాలని ప్రజలకు చెప్పు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 11:2
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత ఆ వ్యక్తి వెండి, బంగారు నగలు, వస్త్రాలు రిబ్కాకు ఇచ్చాడు; అతడు ఆమె సోదరునికి, ఆమె తల్లికి కూడా విలువైన కానుకలిచ్చాడు.


ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు.


ఇశ్రాయేలీయులను వెండి బంగారములతో దేవుడు బయిటకి రప్పించాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరూ తొట్రుపడరు.


భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.


“ఈ ప్రజల పట్ల ఈజిప్టువారిలో దయను పుట్టిస్తాను కాబట్టి మీరు వెళ్లినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు.


ప్రతి స్త్రీ తన పొరుగువారిని వారి ఇంట్లో ఉండే స్త్రీని వెండి బంగారు ఆభరణాలను, బట్టలను అడిగి తీసుకుని వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేయాలి. ఈ విధంగా మీరు ఈజిప్టువారిని కొల్లగొడతారు.”


అందుకు నేను, ‘ఎవరి దగ్గర బంగారు ఆభరణాలు ఉంటే వారు తీసుకురండి’ అని చెప్పాను. అప్పుడు వారు నాకు బంగారం ఇచ్చారు, నేను దాన్ని అగ్నిలో పడేస్తే, ఈ దూడ అయ్యింది!” అని చెప్పాడు.


ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న స్త్రీలు పురుషులు వచ్చి, చెవికమ్మలు, వ్రేలి ఉంగరాలు, నగలు, వివిధ రకాల బంగారు ఆభరణాలు తెచ్చి ఆ బంగారాన్ని పైకెత్తి ఆడించి యెహోవాకు ప్రత్యేక అర్పణగా సమర్పించారు.


మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు, పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది.


వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట.


నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అనుమతి లేదా? లేదా నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ