Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 1:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసలపైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియమించారు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేసు పట్టణాలను కట్టించారు. (ధాన్యం మొదలైన వాటిని వాళ్లు ఈ పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 1:11
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.


కాబట్టి యోసేపు తన తండ్రిని, తన సోదరులను ఈజిప్టులో స్థిరపరచి, దేశంలో శ్రేష్ఠమైన భాగంలో, ఫరో చెప్పినట్టు రామెసేసు జిల్లాను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు.


తన ధాన్యాగారాలను, తన రథాలకు గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో లెబానోనులో తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.


రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్-మయీము, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లను జయించారు.


అతడు ఎడారిలో తద్మోరును, హమాతులో తాను కట్టించిన దుకాణ పట్టణాలన్నిటిని కూడా నిర్మించాడు.


వారు దేశం నుండి దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.


“నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు” అని ఇశ్రాయేలు అనాలి;


“నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.


గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకున్నప్పుడు కూడా, నా పావురం యొక్క రెక్కలు వెండితో, దాని ఈకలు మెరిసే బంగారంతో కప్పబడి ఉంటాయి.”


“నేను వారి భుజాల మీది నుండి భారం తొలగించాను; వారి చేతులు గంపలెత్తుట నుండి విడిపించబడ్డాయి.


మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.


కొన్ని సంవత్సరాల తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత ఒక రోజు అతడు తన సొంత ప్రజలు ఉన్న చోటికి వెళ్లి వారి దుస్థితిని చూశాడు. అప్పుడు అతడు తన సొంత ప్రజల్లో ఒకడైన ఒక హెబ్రీయున్ని ఒక ఈజిప్టువాడు కొట్టడం చూశాడు.


అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.


కాబట్టి బానిసల నాయకులు వారి అధికారులు వెళ్లి ప్రజలతో, “ఫరో ఇలా అంటున్నారు: ‘నేను ఇకపై మీకు గడ్డి ఇవ్వను.


అప్పుడు ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు ఫరో దగ్గరకు వెళ్లి, “మీ సేవకుల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?


అయినప్పటికీ వారు ఇంతకుముందు చేసినన్ని ఇటుకలనే ఇప్పుడు కూడా చేయాలి; కోటా తగ్గించకండి. వారు సోమరివారు కాబట్టి, ‘మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించడానికి మమ్మల్ని పంపించండి’ అని మొరపెడుతున్నారు.


కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?


మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు,


కాని ఈజిప్టువారు మనలను హింసించి, బాధపెట్టి, మనలను కఠినమైన శ్రమకు గురి చేశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ