Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎస్తేరు 9:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అదారు నెల పద్నాలుగవ రోజున యూదులు షూషనులో సమకూడి, షూషనులో మూడువందలమంది మనుష్యులను చంపారు. కాని వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అదారు నెల పద్నాలుగో తేదీన షూషనులోని యూదులు సమకూడి పట్టణంలో మూడు వందల మంది పురుషులను చంపేశారు. అయితే వారు దోపుడు సొమ్ము పట్టుకోలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 అదారు నెల 14వ రోజున షూషను నగరంలో యూదులందరూ గుమికూడి, మరో 300 మంది పురుషులను చంపేశారు. అయితే, వాళ్లకి చెందిన ఏ వస్తువుల్నీ యూదులు ముట్టలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అదారు నెల పద్నాలుగవ రోజున యూదులు షూషనులో సమకూడి, షూషనులో మూడువందలమంది మనుష్యులను చంపారు. కాని వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎస్తేరు 9:15
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజు ఆదేశం, యూదులు ప్రతి పట్టణంలో తమను తాము కాపాడుకునే హక్కు కలిగించింది; వారి మీద, వారి స్త్రీల మీద, పిల్లల మీద దాడి చేసే ఏ జాతి వారినైనా, ఏ సంస్థానం వారినైనా, వారు నాశనం చేయవచ్చు, చంపవచ్చు, నిర్మూలించవచ్చు, వారి శత్రువుల ఆస్తిని కొల్లగొట్టవచ్చు.


ఈ పదిమంది యూదుల శత్రువైన హమ్మెదాతా కుమారుడైన హామాను కుమారులు. అయితే వారు వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.


రాజు ఎస్తేరు రాణితో, “యూదులు షూషను కోటలో అయిదువందల మందిని హామాను పదిమంది కుమారులను చంపారు. రాజు యొక్క ఇతర సంస్థానాలలో ఏమి జరిగింది? ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు ఇస్తాను. నీ కోరిక ఏంటి? అది కూడా చేస్తాను” అన్నాడు.


ఎస్తేరు జవాబిస్తూ, “ఒకవేళ రాజుకు ఇష్టమైతే, ఈ శాసనం రేపు కూడా షూషనులో ఉన్న యూదులు చేసేలా అనుమతి ఇచ్చి హామాను పదిమంది కుమారులు ఉరికంబం మీద వ్రేలాడదీయబడేలా చేయండి” అని చెప్పింది.


కాబట్టి అలా చేయమని రాజు ఆజ్ఞాపించాడు. షూషనులో ఆజ్ఞ జారీ చేయబడింది, వారు హామాను యొక్క పదిమంది కుమారులను ఉరితీశారు.


అంతలో, రాజు సంస్థానాలలో ఉన్న మిగితా యూదులు కూడా తమను తాము కాపాడుకోడానికి సమకూడి శత్రువుల నుండి ఉపశమనం పొందుకున్నారు.వారు డెబ్బై అయిదువేల మందిని చంపారు కాని వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.


యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో తమ పట్టణాల్లో సమావేశమై, వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వారిపై దాడి చేశారు. వారి ఎదుట ఎవరూ నిలువలేకపోయారు, ఎందుకంటే ఇతర దేశాల ప్రజలందరు వారికి భయపడ్డారు.


ప్రతీ కీడును తిరస్కరించండి.


మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు, “నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను; నిన్ను ఎన్నడు త్రోసివేయను.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ