Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎస్తేరు 8:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 రాజు తాకీదులు అందిన ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో యూదులలో ఆనందం, ఉత్సాహం ఉంది, వారు విందు చేసుకుని సంబరపడ్డారు. ఇతర దేశాల ప్రజలు ఎంతోమంది యూదుల భయం పట్టుకుని యూదులుగా మారారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 రాజు చేసిన తీర్మానం, అతని చట్టం అందిన ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో యూదులకు ఆనందం, సంతోషం కలిగాయి. వారంతా పండగ చేసుకున్నారు. అందరికీ యూదులంటే భయం వేసింది. కాబట్టి చాలామంది యూదులయ్యారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 మహారాజు ఆజ్ఞ చేరిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, యూదుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజలకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా మతం పుచ్చుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 రాజు తాకీదులు అందిన ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో యూదులలో ఆనందం, ఉత్సాహం ఉంది, వారు విందు చేసుకుని సంబరపడ్డారు. ఇతర దేశాల ప్రజలు ఎంతోమంది యూదుల భయం పట్టుకుని యూదులుగా మారారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎస్తేరు 8:17
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత వారు బయలుదేరారు. వారి చుట్టూ ఉన్న పట్టణాలకు దేవుని భయం పట్టుకుంది, కాబట్టి వారిని ఎవ్వరూ వెంటాడలేదు.


నెహెమ్యా వారితో, “వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి” అన్నాడు.


ఇది అదారు నెల పదమూడవ రోజున జరిగింది. పద్నాలుగవ రోజు వారు విశ్రమించి ఆ రోజున విందు చేసుకుని ఆనందించారు.


గ్రామాల్లో నివసించే పల్లెవాసులైన యూదులు అదారు నెల పద్నాలుగవ రోజున విందు చేసుకుని ఆనందించే రోజుగా జరుపుకుంటారు, ఆ రోజు ఒకరికి ఒకరు బహుమానాలు ఇచ్చుకుంటారు.


యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో తమ పట్టణాల్లో సమావేశమై, వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వారిపై దాడి చేశారు. వారి ఎదుట ఎవరూ నిలువలేకపోయారు, ఎందుకంటే ఇతర దేశాల ప్రజలందరు వారికి భయపడ్డారు.


యూదులు ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులను ఒక ఆచారంగా నిర్ణయించిన విధానంలో నియమించిన సమయంలో తాము తమ వారసులు, తమతో కలిసే వారందరితో ఖచ్చితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.


సంస్థానాధిపతులు, సామంత రాజులు, ప్రభుత్వ అధికారులు, రాజ్య అధికారులు, అందరు మొర్దెకై అంటే భయంతో యూదులకు సహాయపడ్డారు.


వారంటే ఈజిప్టువారికి భయం పట్టుకుంది, వారు వెళ్లి పోతుంటే, వీరు సంతోషించారు.


ప్రజల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.


భయం దిగులు వారి మీద పడతాయి. యెహోవా, మీ ప్రజలు దాటి వెళ్లేవరకు, మీరు కొనిన మీ ప్రజలు దాటి వెళ్లేవరకు మీ బాహుబలము చేత వారు రాతిలా కదలకుండా ఉంటారు.


మీకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఆయన మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీరు వెళ్లే దేశమంతటికి మీరంటే వణుకును భయాన్ని పుట్టిస్తారు.


ఈ రోజే నేను ఆకాశం క్రింద ఉన్న అన్ని దేశాలకు మీరంటే భయాన్ని, వణుకుని కలిగించడం మొదలుపెడతాను. వారు మీ గురించి సమాచారాన్ని విని వణుకుతారు; మీ కారణంగా వారు కలవరపడతారు.”


ఈ విషయాలు విన్నప్పుడు, మా గుండెలు భయంతో క్రుంగి, మిమ్మల్ని బట్టి ఎవరికి ఏమాత్రం ధైర్యం లేదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమి మీద కూడా దేవుడే.


వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు.


నీ సేవకులను అడిగితే వారు నీకు చెప్తారు. పండుగ సమయంలో మేము వచ్చాం, నా మనుష్యుల మీద దయ చూపించు. దయచేసి నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదే నీ సేవకులకు నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ