ఎస్తేరు 5:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును–ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతోకూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరూ “50 మూరల ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించు. దాని మీద మొర్దెకైని ఉరి తీసేలా రేపు రాజుకు మనవి చెయ్యి. ఆపైన సంతోషంగా రాజుతో కలిసి విందుకు పోవచ్చు” అని అతనితో చెప్పారు. ఈ సంగతి హామానుకు సముచితంగా తోచింది. అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 అప్పుడు హామాను భార్య జెరెషూ, అతని మిత్రులందరూ ఇలా సలహా యిచ్చారు: “మొర్దెకైని ఉరితీసేందుకుగాను ఒక స్తంభం పాతమని ఎవరినైనా పురమాయించు! ఆ ఉరికొయ్య 75 అడుగుల పొడుగు వుండాలి! ఇంకేముంది, రేపు ఉదయం మహారాజుతో ఆ ఉరికొయ్య మీద ఆ యూదుని ఉరితీయించమని చెప్పు. మహారాజుతో కలిసి విందుకి వెళ్లు. అప్పుడిక చూసుకో, నీ ఆనందానికి మేరవుండదు.” హామానుకి ఆ సలహా నచ్చింది. వెంటనే అతను ఉరి కంబం సిద్ధం చేయమని ఒకణ్ణి ఆజ్ఞాపించాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు. အခန်းကိုကြည့်ပါ။ |