Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రసంగి 11:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి, మీ శరీర బాధలను వెళ్లగొట్టండి, ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి. నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు. ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి. ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థులుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి, మీ శరీర బాధలను వెళ్లగొట్టండి, ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రసంగి 11:10
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.


మీరు నాకు కఠిన శిక్ష విధించారు యవ్వనకాలంలో చేసిన పాపాల ప్రతిఫలం అనుభవించేలా చేశారు.


వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం వారితో పాటు మట్టిపాలవుతుంది.


యవ్వనంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి. ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.


మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు; నా జీవితకాలం మీ ఎదుట శూన్యము. భద్రత గలవారిగా అనిపించినా, మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా


“నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు; వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.


యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది, క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది.


సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే.


ఈ ప్రసంగి ఇలా అంటున్నాడు, “అర్థరహితం! అర్థరహితం! అంతా అర్థరహితమే.”


కష్ట దినాలు రాకముందే “వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే, నీ యవ్వన ప్రాయంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.


ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.


యవ్వనకాల ఆశల నుండి పారిపో, కపటం లేని హృదయంతో ప్రభువును వేడుకొనువారితో పాటు నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతిని అనుసరించు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ