Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 9:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 అయితే దహించే అగ్నిలా మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా దాటి వెళ్తారని మీరు నమ్మండి. ఆయన వారిని నాశనం చేస్తారు; మీ ఎదుట వారిని అణచివేస్తారు. యెహోవా మీకు ప్రమాణం చేసిన ప్రకారం, మీరు వారిని వెళ్లగొట్టి త్వరగా వారిని నిర్మూలం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 కాబట్టి మీ యెహోవా దేవుడు తానే దహించే అగ్నిలాగా మీకు ముందుగా దాటిపోతున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన వారిని నాశనం చేసి మీ ఎదుట వారిని కూలదోస్తాడు. యెహోవా మీతో చెప్పినట్టు మీరు వారిని వెళ్ల గొట్టి త్వరగా వారిని నాశనం చేస్తారు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 అయితే మీ దేవుడైన యెహోవా నాశనం చేసే అగ్నిలా మీకు ముందర ఆ నదిని దాటుతాడని మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఆ దేశాలను యెహోవా నాశనం చేస్తాడు. వాళ్లు మీ ముందు పతనమయ్యేలా ఆయన చేస్తాడు. ఆ దేశస్తులను మీరు బయటకు వెళ్లగొట్టేస్తారు. త్వరగా మీరు వారిని నాశనం చేస్తారు. ఇలా జరుగుతుందని యెహోవా మీకు వాగ్దానం చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 అయితే దహించే అగ్నిలా మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా దాటి వెళ్తారని మీరు నమ్మండి. ఆయన వారిని నాశనం చేస్తారు; మీ ఎదుట వారిని అణచివేస్తారు. యెహోవా మీకు ప్రమాణం చేసిన ప్రకారం, మీరు వారిని వెళ్లగొట్టి త్వరగా వారిని నిర్మూలం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 9:3
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా దూత మీకు ముందుగా వెళ్తూ, అమోరీయుల హిత్తీయుల పెరిజ్జీయుల కనానీయుల హివ్వీయుల యెబూసీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాడు, నేను వారిని నిర్మూలం చేస్తాను.


ఇశ్రాయేలీయులకు యెహోవా మహిమ ఆ పర్వతం మీద దహించే అగ్నిలా కనిపించింది.


నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను.


చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.


యెహోవా తన ప్రభావం గల స్వరాన్ని ప్రజలకు వినిపిస్తారు, భయంకరమైన కోపంతో దహించే అగ్నితో మేఘ విస్పోటంతో, ఉరుముల తుఫానుతో, వడగండ్లతో తన చేయి క్రిందికి రావడాన్ని ప్రజలు చూసేలా చేస్తారు.


చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం సిద్ధపరచబడింది; అది రాజు కోసం సిద్ధపరచబడింది. విస్తారమైన అగ్ని, చెక్కతో దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది; యెహోవా ఊపిరి మండుతున్న గంధక ప్రవాహంలా దానిని రగిలిస్తుంది.


సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; భక్తిహీనులకు వణుకు పుడుతుంది. “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?”


అడ్డును పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్తాడు; వారు గుమ్మాన్ని పడగొట్టి, దానిగుండా బయటకు వెళ్తారు. వారి రాజు వారికి ముందుగా వెళ్తాడు, యెహోవా వారికి నాయకునిగా ఉంటారు.”


యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “మీరు విని తెలుసుకోండి.


యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి.


అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు?


కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.


మీకు ముందుగా నడుస్తున్న మీ దేవుడైన యెహోవా మీ కళ్ళెదుట ఈజిప్టులోను అరణ్యంలోను మీ కోసం చేసినట్లు ఆయన మీ కోసం యుద్ధం చేస్తారు,


మీ శత్రువులతో యుద్ధానికి వెళ్లినప్పుడు, మీ దగ్గర ఉన్నవాటి కంటే వారి దగ్గర ఎక్కువ గుర్రాలు, రథాలను చూసినప్పుడు, వారికి భయపడవద్దు, ఎందుకంటే ఈజిప్టు నుండి క్షేమంగా రప్పించిన మీ దేవుడైన యెహోవా మీతో ఉంటారు.


శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”


ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, ఆయన రోషం గల దేవుడు.


మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.


మీ దేవుడైన యెహోవా ఆ జనాంగాలను మీ ఎదుట నుండి కొద్దికొద్దిగా తొలగిస్తారు. అడవి జంతువులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఒకేసారి వారందరిని నాశనం చేయడానికి అనుమతి లేదు.


మీరు మొండి ప్రజలు కాబట్టి, మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోవడానికి ఈ మంచి దేశాన్ని మీకు ఇవ్వడానికి మీ నీతి కారణం కాదని మీరు గ్రహించండి.


దేవుని ఎరుగని వారిని, మన ప్రభువైన యేసు యొక్క సువార్తకు లోబడని వారిని ఆయన శిక్షిస్తారు.


ఎందుకంటే మన “దేవుడు దహించు అగ్ని.”


యెహోషువ ఈ రాజ పట్టణాలన్నిటిని, వాటి రాజులందరినీ పట్టుకుని ఖడ్గంతో చంపాడు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని పూర్తిగా నాశనం చేశాడు.


యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు. వీరు వారిని ఓడించి, మహా పట్టణమైన సీదోను వరకు, మిస్రెఫోత్-మయీము వరకు, తూర్పున మిస్పే లోయవరకు ఏ ఒక్కరు మిగులకుండా వారిని వెంటాడి చంపారు.


ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు.


చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది.


కాబట్టి యాజకులు ప్రజలకు ముందుగా నిబంధన మందసం మోస్తూ నడుస్తుండగా ప్రజలు వారి శిబిరాల నుండి యొర్దాను దాటడానికి బయలుదేరతారు.


అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ